స్త్రీల రొమ్ముపై పన్ను వేసిన రాజ్యం

17వ శతాబ్దంలో కేరళ ట్రావెన్కోర్ రాజులు జనాలపై విధించిన పన్నులు అతి హేయమైనవి. ఈ విషయం గురించి చరిత్రను తిరగేస్తే అర్థమవుతుంది. 

Last Updated : Feb 2, 2018, 12:46 PM IST
స్త్రీల రొమ్ముపై పన్ను వేసిన రాజ్యం

17వ శతాబ్దంలో కేరళ ట్రావెన్‌కోర్ రాజులు జనాలపై విధించిన పన్నులు అత్యంత హేయమైనవి. ఈ విషయం గురించి చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. కేరళను పాలించే ట్రావెన్‌కోర్ రాజులు స్త్రీల రొమ్ములపై  కూడా పన్ను విధించేవారట. దానిని వారు ముళకరం (రొమ్ము పన్ను) అని పిలిచేవారట. ఈ పన్ను ప్రకారం రొమ్ము పరిమాణాన్ని బట్టి సుంకం చెల్లించాలి. తల్లులు పాలివ్వాలంటే ముందు రొమ్ము పన్ను కట్టాల్సిందే..! 'ముళకరం' పన్నును అప్పటి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.   

ఒకనాడు ట్రావెన్‌కోర్ రాజుల సంస్థానంలోని "చేరితాలా' అనే గ్రామానికి చెందిన కాపుంతల దళిత మహిళ 'నాంగేలి' రొమ్ము పన్ను చెల్లించకుండా బిడ్డకు పాలిచ్చింది. విషయం తెలుసుకున్న రాజులు అక్కడికి వెళ్లి ఆమెను నిలదీశారు. పన్ను చెల్లించకుండా ఎందుకు పాలివచ్చావని వారు గట్టిగా అడగ్గా.. ఆమె ఇంట్లోకి  వెళ్లిపోయింది. పన్ను డబ్బులు తీసుకొస్తుందేమో అని అక్కడున్న వారందరూ అనుకున్నారు. కానీ చాలా సేపయ్యాక రెండు రొమ్ముల కోసి పట్టుకొచ్చింది ఆమె.  ఆ తర్వాత ప్రజల ఎదుటే ప్రాణాలు విడిచింది. 

ఆ హఠాత్ పరిణామానికి అందరూ హతాశులయ్యారు. ఆమె పేరుమీదుగానే ఆ గ్రామానికి "ములచ్చి పురంబు (రొమ్ము కోసిన మహిళ)" అనే పేరు వచ్చింది.ఈ క్రూరమైన దురాచారానికి వ్యతిరేకంగా గళమెత్తిన వారిలో నాంగేలి తొలి మహిళేమీ కాదు. 1813-1859 మధ్య కల్లుగీత కార్మికులైన కొందరు మహిళలు సవర్ణ మహిళల లాగానే తమకూ రొమ్ముల్ని కప్పుకునే హక్కుండాలంటూ పోరాటం చేశారు. వారి పోరాటాన్ని చన్నార్‌ తిరుగుబాటుగా పిలుస్తారు.

Trending News