Covid-19: తెలంగాణలో 2,123 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో ఈ మహమ్మారి కేసులు నిత్యం రెండువేలకు పైగా నమోదవుతున్నాయి.

Last Updated : Sep 19, 2020, 09:29 AM IST
Covid-19: తెలంగాణలో 2,123 కరోనా కేసులు

Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో ఈ మహమ్మారి కేసులు నిత్యం రెండువేలకు పైగా నమోదవుతున్నాయి. అయితే.. గత 24 గంటల్లో శుక్రవారం ( సెప్టెంబరు 18న ) తెలంగాణలో కొత్తగా 2,123 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 9 మంది మరణించారు. ఈ మేరకు శనివారం ఉదయం తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,169 కి పెరగగా.. ఇప్పటివరకు కరోనాతో 1,025మంది మరణించారు. Also read: Urmila Matondkar: కంగనా అడల్ట్ స్టార్ కామెంట్‌పై ఊర్మిళ ట్వీట్

ప్రస్తుతం తెలంగాణలో 30,636 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటివరకు 1,37,508 మంది బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా.. శుక్రవారం 54,459 కరోనా టెస్టులు చేశారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 24,34,409 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 81.28 శాతం ఉండగా.. మరణాల రేటు 0.60 శాతం ఉంది. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీలో 305 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డిలో 185, మేడ్చెల్ మల్కాజ్‌గిరిలో 149 చొప్పున కేసులు నమోదయ్యాయి. Also read: Air India: దుబాయ్‌కు యథావిధిగా విమాన సర్వీసులు

Trending News