మిషన్ అంత్యోదయ ర్యాంకుల్లో ఏపీ నెం.1

భారతదేశంలోని దాదాపు కోటి కుటుంబాల్లో 2019 నాటికి పేదరికాన్ని రూపుమాపాలని  ధ్యేయంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ దిశగా అంత్యోదయ-2019 పథకాన్ని ప్రవేశపెట్టింది. 

Last Updated : Dec 22, 2017, 08:00 PM IST
మిషన్ అంత్యోదయ ర్యాంకుల్లో ఏపీ నెం.1

భారతదేశంలోని దాదాపు కోటి కుటుంబాల్లో 2019 నాటికి పేదరికాన్ని రూపుమాపాలని  ధ్యేయంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ దిశగా అంత్యోదయ-2019 పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో మిషన్‌ అంత్యోదయపై రాష్ర్టాల అభిప్రాయాలను సేకరించి నిధులు మంజూరు చేసిన కేంద్రం.. ఇటీవలే  ఆ పథకాన్ని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్రాలను గుర్తించి, ఆయా రాష్ట్రాలలో గ్రామాల సమగ్ర అభివృద్ధిని అంచనా వేసి ర్యాంకులను ప్రకటించింది. ఆ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం విశేషం.

ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ పది గ్రామ పంచాయతీల్లో ఏడు ఏపీలోనే ఉండడం గమనార్హం.  చిత్తూరు జిల్లా పరపట్ల గ్రామం, విశాఖ జిల్లా చిడికాడ గ్రామం,  తూర్పుగోదావరి జిల్లా కాజులూరు గ్రామం, కృష్ణా జిల్లా ఉంగటూరు గ్రామం, చిత్తూరు జిల్లా ఎగువ తవనంపల్లి, కృష్ణా జిల్లా ఇందుపల్లి, చిత్తూరు జిల్లా కలికిరి ఉత్తమ గ్రామాలుగా ఎంపికై, ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానాన నిలిచేలా చేశాయి. అలాగే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 83 ఉత్తమ గ్రామాలను ప్రభుత్వం ఉత్తమమైన వాటిగా ఎంపిక చేయగా అందులో 33 ఆంధ్రప్రదేశ్‌లో ఉండడం గమనార్హం. మన రాష్ట్రం తర్వాత 21 గ్రామాలతో తమిళనాడు, 6 గ్రామాలతో కేరళ, 5 గ్రామాలతో మహారాష్ట్ర, 4 గ్రామాలతో తెలంగాణ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

Trending News