Expiry Date Trailer: సస్పెన్స్‌కి గురిచేస్తున్న ఎక్స్‌పైరి డేట్ ట్రైలర్

స్నేహ ఉల్లాల్, మధు షాలిని, మలయాళ నటుడు టోనీ ల్యుక్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజా నటిస్తోన్న థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్' ( Expiry Date web series ). అక్టోబర్ 9న ZEE5 ఒరిజినల్స్ ప్రీమియర్‌లో విడుదల కానున్న ఎక్స్‌పైరీ డేట్‌ వెబ్ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్‌ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది.

Last Updated : Oct 3, 2020, 02:40 AM IST
Expiry Date Trailer: సస్పెన్స్‌కి గురిచేస్తున్న ఎక్స్‌పైరి డేట్ ట్రైలర్

స్నేహ ఉల్లాల్, మధు షాలిని, మలయాళ నటుడు టోనీ ల్యుక్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజా నటిస్తోన్న థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్' ( Expiry Date web series ). అక్టోబర్ 9న ZEE5 ఒరిజినల్స్ ప్రీమియర్‌లో విడుదల కానున్న ఎక్స్‌పైరీ డేట్‌ వెబ్ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్‌ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఎక్స్‌పైరి డేట్ ట్రైలర్‌లో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఒక ఫ్రెండ్ వివాహానికని వెళ్లిన తన భార్య తప్పిపోయింది అని ఫిర్యాదు చేస్తాడు. యాదృచ్ఛికంగా, అదే పెళ్లికి హాజరవడానికి వెళ్ళిన తన భర్త కూడా తప్పిపోయాడని మరొక మహిళ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. Also read : Niharika fitness secrets: నిహారిక పెళ్లికి రెడీ అవుతోందట!

ఈ తప్పిపోయిన వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ( Extramarital affairs ) ఎమైనా ఉందా? లేదా వారు ఊహించని విధంగా ఏమైనా ఇబ్బందుల్లో చిక్కుకున్నారా ? అనే ప్రశ్నలకి జవాబులు, కనుమరుగైపోయిన రహస్యాలని బయటికి తీసుకొచ్చేదే ఈ ఎక్స్‌పైరి డేట్ వెబ్ సిరీస్ కథాంశం. 

మధుషాలిని ( Actress Madhushalini ) తెలుగులో అందరివాడు, కితకితలు, జగడం, కారాలు మిరియాలు, గూఢాచారి వంటి సినిమాలలో నటించింది. స్నేహ ఉల్లాల్ ( Actress Sneha Ullal ) ఉల్లాసంగా ఉత్సాహంగా, నేను మీకు తెలుసా, కరెంట్, సింహా, అలా మొదలైంది, మడత ఖాజా వంటి సినిమాల్లో నటించింది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోపోతున్నారు. ఎక్స్‌పైరి డేట్ ట్రైలర్ ( Expiry Date web series trailer ) చూస్తే.. సస్పెన్స్‌కి గురిచేసే అంశాలెన్నో ఉన్నాయనిపిస్తోంది. ఎక్స్‌పైరి డేట్ వెబ్ సిరీస్ ఆడియెన్స్ ముందుకొస్తే కానీ ఆ సస్పెన్స్ ఏంటో వీడేలా లేదు. Also read : Allu Arjun about Palasa 1978: దర్శకుడికి అల్లు అర్జున్ బూస్టింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News