Google Search: రషీద్ ఖాన్ వైఫ్ అనుష్క శర్మ అట కదా..

గూగుల్ ఎప్పుడు ఏమని చూపిస్తుందో...అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే మంచిది. లేకుంటే ఇలానే అవుతుంది మరి. ఇంతకీ ఏమైందేంటని అడగవద్దు. రషీద్ ఖాన్ భార్య పేరు అనుష్క శర్మ అని వస్తుంటే ఆశ్చర్యం కాక మరేంటి. విరాట్ కోహ్లీ సంగతేంటి మరి..

Last Updated : Oct 12, 2020, 01:00 PM IST
  • రషీద్ ఖాన్ వైఫ్ అని సెర్చ్ చేస్తే చాలు...
  • అనుష్క శర్మ అని వస్తుండటంతో విస్తుపోతున్ననెటిజన్లు
Google Search: రషీద్ ఖాన్ వైఫ్ అనుష్క శర్మ అట కదా..

గూగుల్ ( Google ) ఎప్పుడు ఏమని చూపిస్తుందో...అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే మంచిది. లేకుంటే ఇలానే అవుతుంది మరి. ఇంతకీ ఏమైందేంటని అడగవద్దు. రషీద్ ఖాన్ ( Rashid khan ) భార్య పేరు అనుష్క శర్మ ( Anushka Sharma ) అని వస్తుంటే ఆశ్చర్యం కాక మరేంటి. విరాట్ కోహ్లీ సంగతేంటి మరి.. 

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Team India captain Virat kohli ) భార్య అనుష్క శర్మ అని అందరికీ తెలుసు. క్రికెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు. అటువంటప్పుడు మరి ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan ) లెగ్ స్పిన్ సంచలనమైన రషీద్‌ ఖాన్‌ భార్య ( Rashid khan wife ) అని వస్తుందేమిటి?  ఈ సందేహం ఎందుకొచ్చంది? ఎందుకంటే గూగుల్ మరి అలా చూపిస్తోంది. గూగుల్ అంతలా చూపిస్తుంటే ఇలాంటి సందేహం రావడం సహజమే. అసలు విషయం ఏంటనేది పరిశీలిద్దాం. 

గూగుల్‌లో సెర్చ్ ( Google Search ) లో రషీద్‌ ఖాన్‌ వైఫ్ అని టైప్ చేస్తే... అనుష్క శర్మ అనే వస్తుంది. నిజం చెప్పాలంటే 22 ఏళ్ల ఈ ఆప్ఘన్ బౌలర్ కు అసలు పెళ్లే కాలేదు. కానీ అనుష్క శర్మ అని వస్తుంది. ఇలా ఎందుకొస్తుందో అర్ధం కాక కొందరు వర్రీ అవుతుంటే మరి కొందరు ఫన్నీగా ఎంజాయ్ చేస్తున్నారు. వాస్తవానికి 2018లో ఒకసారి తన ఫేవరెట్ హీరోయిన్లు అనుష్క శర్మ, ప్రీతి జింటా అంటూ ఇన్ స్టాగ్రామ్ లో రషీద్ ఖాన్ పంచుకున్నాడు. అప్పట్నించి ఈ వార్త ట్రెండింగ్ అయింది. అప్పట్లో రషీద్ ఖాన్ ఫేవరెట్  అనుష్క శర్మ అని వార్తలెక్కువగా వచ్చేవి. ఆ వార్తల ప్రభావం అనుకుంటా..గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువైపోయినట్టుంది. రషీద్ ఖాన్ వైఫ్ అని సెర్చ్ చేస్తుంటే...అనుష్క శర్మ అనే వస్తుంది. మీకేమాత్రం సందేహంగా ఉన్నా సరే..ఇప్పుడే టైప్ చేసి చూడండి. అనుష్క శర్మ అని ఠక్కున చూపిస్తుంది. 

ఏదైమైనా ప్రస్తుతం రషీద్ ఖాన్ వైఫ్ అనే పదం బాగా ట్రెండ్ అవుతోంది. ఇదే ఇప్పుడు టాగ్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం రషీద్ ఖాన్, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు తెలుసో లేదో ఇంకా. 

ఇక అఫ్గనిస్తాన్‌కు చెందిన రషీద్‌ ఖాన్‌ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian premier league ) ( IPL 2020 ) ( ఐపీఎల్ ) 2020‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ( Sunrisers Hyderabad ) జట్టులో ఆడుతున్నాడు. సన్‌రైజర్స్‌ జట్టులో కీలకమైన లెగ్ స్పిన్నర్ గా సేవలందిస్తున్నాడు. తన పదునైన బౌలింగ్ తో ముప్పుతిప్పలు పెడుతున్న రషీద్ ఖాన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అఫ్గనిస్తాన్‌ జట్టు వరల్డ్‌ కప్‌ గెలిచే వరకు తాను పెళ్లి చేసుకోనని ఇదివరకు  ఓసారి చెప్పి ఉన్నాడు.  ఇక విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు 2017లో వివాహం చేసుకున్నారు. 2013లో ప్రారంభమైన వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకూ సాగింది. త్వరలో అనుష్క శర్మ ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది కూడా. 

Trending News