Best bowler in IPL 2020: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ ( RCB vs KKR match ) జట్ల మధ్య షార్జా క్రికెట్ స్టేడియంలో ఇవాళ రాత్రి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో ఉత్తమమైన బౌలర్ల రికార్డును ఓసారి పరిశీలిస్తే... యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) ఈ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు అయినప్పటికీ.. బ్యాట్స్మెన్లను ఎక్కువ పరుగులు చేయకుండా కట్టడి చేసి ఉక్కిరిబిక్కిరి చేయడంలో మాత్రం ఆఫ్-స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) పేరే ప్రముఖంగా చెప్పుకోవచ్చు అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. పవర్‌ప్లేలో, మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసి వారిని తక్కువ స్కోర్‌కి పరిమితం చేయడం ద్వారా ఇప్పటివరకు తన జట్టు విజయంలో చాహల్ లాంటి సీనియర్ బౌలర్లకు సమానంగా పాత్ర పోషించిన బౌలర్ అనిపించుకున్నాడు వాషింగ్టన్ సుందర్. Also read : CSK vs RCB match: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరిసారిగా గెలిచిన మ్యాచ్ రిజల్ట్
Washington Sundar in IPL 2020: ఐపిఎల్ 2020లో వాషింగ్టన్ సుందర్ ఎకానమి రేట్
ఐపిఎల్ 2020లో వాషింగ్టన్ సుందర్ ఎకానమి రేట్ 4.88 గా ఉంది. ఈ సీజన్ మొత్తంలో అన్ని ఫ్రాంచైజీల బౌలర్లలోనూ ఇదే అత్యుత్తమమైన ఎకానమి రేటు. స్పిన్ విజార్డ్ రషీద్ ఖాన్ ( Rashid Khan ) కంటే కూడా ఇది తక్కువే. అదే సమయంలో చాహల్ ఎకానమి రేటు 7.78గా ఉంది అంటే సుందర్ బౌలింగ్ ఎంత కట్టుదిట్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) ఆడిన 6 మ్యాచ్‌లలో మొత్తం 18 ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్.. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌కి కేవలం 88 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ సీజన్లో సుందర్ బౌలింగ్ చేసిన 108 బంతులలో.. 43 డాట్ బాల్స్ ( Dot balls ) ఉన్నాయి. అంటే సుందర్ వేసిన బంతులలో 40శాతం బంతులు బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించడానికి ఆస్కారం ఇవ్వలేదన్నమాట. Also read : KKR vs CSK match: కోల్‌కతా నైట్ రైడర్స్ చివరి మ్యాచ్ ఫలితం
IPL 2020 లో ఎంతో మంది సూపర్ బౌలర్స్ ( Best bowlers of IPL 2020 ) ఉన్నప్పటికీ.. వాళ్లకు, వాషింగ్టన్ సుందర్‌కి ఉన్న తేడా ఏంటంటే... వాళ్లంతా ఇన్నింగ్స్ మధ్య మిడిల్ ఓవర్లు బౌలింగ్ చేస్తే... వాషింగ్టన్ సుందర్ మాత్రం ఎక్కువగా పవర్ ప్లేలోనే బౌలింగ్ చేయడం గమనార్హం. దీంతో సుందర్ ఆడుతున్న ఒక్కో మ్యాచ్‌తో తన లైన్ అండ్ లెంగ్త్‌ని మెరుగు పర్చుకుంటున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్స్ పట్టికలో టాప్ 4లో నిలిచిందంటే అందులో సుందర్ పాత్ర కూడా లేకపోలేదు. Also read : IPL 2020 SRH vs RR: రాజస్తాన్ కుర్రాళ్ల మెరుపు బ్యాటింగ్.. అద్భుతమైన విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe