విశాఖపట్టణం ( Visakhapatnam ) లో జరిగిన భూ కుంభకోణం ( Lands scam ) పై నిగ్గు తేలనుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాం ( Telugu desam period ) లో జరిగిన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం మళ్లీ విచారణ ప్రారంబించింది. కరోనా వైరస్ కారణంగా ఆగిన దర్యాప్తు 8 నెలల అనంతరం తిరిగి ప్రారంభమైంది.
భూముల స్థితిగతుల్లో మార్పులు, ఇష్టారాజ్యంగా జారీ చేసిన ఎన్వోసీలు, రికార్డుల ట్యాంపరింగ్, ప్రభుత్వ స్థలాల్ని ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కట్టబెట్టడం వంటివి గత ప్రభుత్వ హయాంలో విపరీతంగా జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు కోసం వైసీపీ ప్రభుత్వం ( Ysrcp Government ) సిట్ ( SIT ) ఏర్పాటు చేసింది. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ యేడాది మార్చ్ నుంచి ఆగిపోయిన విచారణ ఇప్పుడు మళ్లీ మొదలైంది.
విశాఖ జిల్లా ( Visakhapatnam District ) లోని 13 మండలాల్లో భూ కుంభకోణాలు జరిగినట్టుగా సిట్ బృందం గుర్తించింది. విశాఖ రూరల్, ఆనందపురం, పద్మనాభం, భీమిలితో పాటు నగర పరిధిలోని మహారాణిపేట, ములగాడ, గోపాలపట్నం, సీతమ్మ ధార, గాజువాక, పెద గంట్యాడ, సబ్బవరం, పరవాడ, పెందుర్తి మండలాల్లో భూ కుంభకోణాలు జరిగాయనేది ప్రధానంగా వచ్చిన ఆరోపణలు. వెబ్ ల్యాండ్ లో పేర్పు మార్చడం, సర్వే నెంబర్లు దిద్దడం, జిరాయితీ భూముల్లో పెద్దల పేర్లు చేర్చడం, తాతముత్తాతల కాలం నుంచి భూమి స్వాధీనంలో ఉన్నప్పటికీ రాత్రికి రాత్రే పేర్లు మార్చడం వంటివి చాలా జరిగాయని సిట్ గుర్తించింది. స్వాతంత్య్ర సమరయోధులు, మిలిటరీలో పనిచేసిన వ్యక్తులకు చెందిన భూములను ఇతరులకు ఇచ్చే విషయంలో కూడా ఎన్వోసీలు ఇష్టారాజ్యంగా జారీ చేశారు. వీటన్నింటిపై సమగ్రంగా దర్యాప్తు అనంతంర సిట్ నివేదిక రూపొందించనుంది.
సిట్ చైర్మన్ డాక్టర్ విజయకుమార్ నేతృత్వంలో కమిటీ భేటీ జరిగింది. ఈ కుంభకోణానిక సంబంధించి ఇప్పటికే కమిటీ తన మద్యంతర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. మరో 2-3 నెలల్లో విచారణ పూర్తి చేయాలని సిట్ యోచిస్తోంది. సిట్ దృష్టికి ఇప్పటి వరకూ 14 వందల ఫిర్యాదులు అందాయి. ఇందులో 4 వందల ఫిర్యాదులపై విచారణ పూర్తి కాగా..ఇంకా వేయి ఫిర్యాదులపై విచారణ చేయాల్సి ఉంది. Also read: Heavy Rains Alert: భారీ వర్షాల ముప్పు ఇంకా పొంచి ఉంది, జాగ్రత్త