Don't miss me so much I will be there soon: Kangana Ranaut: న్యూఢిల్లీ: మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై శనివారం ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై స్పందిచిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ఎప్పటిలాగానే మహారాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు సంధించింది. ఈ క్రమంలో ఆమె మహారాష్ట్ర అధికార పార్టీను పప్పుసేన అంటూ ఘాటైన విమర్శలు చేస్తూ.. ఆదివారం బాలీవుడ్ (Bollywood) నటి ట్విట్ చేసింది. ‘‘నవరాత్రి రోజున ఎవరెవరు ఉపవాసం ఉంటున్నారు.. నేను కూడా ఉపవాసం ఉంటున్నాను. నేటి పూజల ఫొటోలను మీతో పంచుకుంటున్నాను. ఇదిలాఉంటే నాపై మరొక కేసు నమోదయింది. ఇది చూస్తుంటే పప్పు సేనకు నాపై మక్కువ ఎక్కువై పోయిందనుకుంటా.. నన్ను ఎక్కువగా మిస్ కాకండి.. త్వరలోనే అక్కడికి వస్తా’’ అంటూ నటి కంగనా రనౌత్ వ్యంగ్యంగా కమెంట్ చేసింది. ఈ మేరకు ఆమె తన నవరాత్రి ఫోటోలను షేర్ చేసింది.
Who all are fasting on Navratris? Pictures clicked from today’s celebrations as I am also fasting, meanwhile another FIR filed against me, Pappu sena in Maharashtra seems to be obsessing over me, don’t miss me so much I will be there soon ❤️#Navratri pic.twitter.com/qRW8HVNf0F
— Kangana Ranaut (@KanganaTeam) October 17, 2020
అయితే కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్ బాలీవుడ్, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, దీంతోపాటు మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ ఫిర్యాదు చేయగా.. పోలీసులు తన ఫిర్యాదును నమోదు చేయలేదంటూ మున్నవారలి అకసాహిల్ అష్రాఫలి సయ్యద్ బాంద్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శనివారం విచారించిన బాంద్రా కోర్టు ఆమెపై కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను ఆదేశించింది. అంతకుముందు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తుమకూరు కోర్టు ఆదేశాల మేరకు కంగనాపై ఎఫ్ఐఆర్ దాఖలైన సంగతి తెలిసిందే. Also read: Kangana Ranaut: విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ మరో కేసు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నాటినుంచి కంగనా రనౌత్ నిత్యం ఘాటైన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. మొదట్లో బాలీవుడ్లో నెపోటిజం, ఆతర్వాత డ్రగ్స్‌పై కామెంట్లు చేసిన కంగనా.. అనంతరం ఎకంగా మహారాష్ట్ర ప్రభుత్వంపైనే (Maharashtra Government ) పలు వ్యాఖలు చేస్తూ వస్తోంది. Also read: Navratri Day 2: ‘బాలా త్రిపురసుందరి’గా అమ్మవారి దర్శనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe