కరోనా వైరస్ ( Coronavirus ) ఇటీవలి కాలంలో రాజకీయ నేతల్ని లక్ష్యంగా చేసుకున్నట్టు కన్పిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర ( Maharashtra ) లో వైరస్ బారిన పడుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి , బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ కరోనా వైరస్ బారినపడ్డారు.
కరోనా వైరస్ మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తోంది. ఈసారి రాజకీయ నేతల్ని టార్గెట్ చేస్తున్నట్టే ఉంది. కరోనా వైరస్ బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ( Maharashtra Ex Cm Devendra Fudnavis ) కు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణైంది. సోషల్ మీడియా ద్వారా ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. గత కొద్దిరోజుల్నించి తనతో సన్నిహితంగా మెలిగిన వారు పరీక్షలు చేసుకోవాల్సిందిగా సూచించారు. లాక్‌డౌన్ నుంచి నిరంతరం పనిలో ఉన్నానని.. ఇప్పుడిక కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని ఆ దేవుడు కోరుకున్నట్టున్నాడ అని ట్వీట్ చేశారు. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు.
I have been working every single day since the lockdown but now it seems that God wants me to stop for a while and take a break !
I have tested #COVID19 positive and in isolation.
Taking all medication & treatment as per the advice of the doctors.— Devendra Fadnavis (@Dev_Fadnavis) October 24, 2020
ఇటీవల కాలంలో వరుసగా అగ్రనేతలంతా కరోనా బారిన పడుతున్నారు. దాంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Central minister Amit shah ) సైతం కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన అశోక్ గస్తీ కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేవేంద్ర ఫడ్నవీస్ త్వరగా కోవిడ్ నుంచి కోలుకోవాలని బీజేపీ అగ్ర నేతలు, కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు. Also read: Kapil Dev: కోలుకుంటున్న క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్
Maharashtra: మాజీ ముఖ్యమంత్రి దేవేంద్రకు కరోనా