Bihar Assembly Election: వ్యాక్సిన్ ఉచితం సరైందే: ఈసీ

బీహార్ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ (NDA) తిరిగి అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ బీజేపీ (BJP) మ్యానిఫెస్టోలో ప్రకటించింది. దీనిపై ఇప్పటికే విపక్ష పార్టీలు బీజేపీపై విరుచుకుపడుతున్నాయి.

Last Updated : Oct 31, 2020, 02:53 PM IST
Bihar Assembly Election: వ్యాక్సిన్ ఉచితం సరైందే: ఈసీ

EC clears BJP free coronavirus vaccine promise న్యూఢిల్లీ‌: బీహార్ (Bihar) ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ (NDA) తిరిగి అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ బీజేపీ (BJP) మ్యానిఫెస్టోలో ప్రకటించింది. దీనిపై ఇప్పటికే విపక్ష పార్టీలు బీజేపీపై విరుచుకుపడుతున్నాయి. తయారు కాని ( free coronavirus vaccine) వ్యాక్సిన్‌ను ఒక రాష్ట్ర ప్రజలకే ఉచితంగా ఎలా ఇస్తారని.. మిగతా రాష్ట్రాలు ఈ దేశంలో లేవా..? అంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో సాకేత్ గోఖలే అనే ఆర్టీఐ కార్యకర్త (RTI activist Saket Gokhale) సమాచార హక్కు చట్టం కింద.. బీజేపీ ప్రకటించిని హామీ సరైందా.. కాదా అంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని (Election Commission of India) ప్రశ్నించారు. Also read: Bihar elections: ఎల్జేపీ అధికారంలోకి వస్తే నితీశ్ జైలుకే: చిరాగ్ పాశ్వాన్

దీనికి స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఉచిత కోవిడ్ -19 వ్యాక్సిన్ హామీ ఎంత మాత్రమూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది.  రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోల్లోని హామీలు రాజ్యాంగానికి విరుద్దంగా ఉండకూడదని, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేలాగా.. ఓటర్లపై అనవసర ప్రభావాన్ని చూపకుండా ఉండేలాగా చూడాలని సూచించింది. అయితే మోడ‌ల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్‌లోని 8వ పార్ట్ ప్ర‌కార‌మే ఈ ఎన్నిక‌ల హామీ ఉందని ఈసీ స్పష్టంచేసింది.  Also read: Tejashwi Yadav: సీఎం అభ్యర్థికి చేదు అనుభవం

 ఇదిలాఉంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఈ నెల 28వ తేదీన ముగిసింది. రెండో విడత పోలింగ్ నవంబర్ 3న, చివరి విడత పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. ఫలితాలు నవంబర్ 10 వెలువడనున్నాయి.  Also read: Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News