AP COVID-19 UPDATES: ఏపీలో కొత్తగా 2618 కరోనా కేసులు, 16 మంది మరణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల్లో ఆదివారం రోజు తగ్గుదల కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య విభాగం జారీ చేసిన తాజా హెల్త్ బులెటిన్ లో కొత్తగా 2618 కేసులు నమోదు అయినట్టు తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,25,966కు చేరుకుంది.

Last Updated : Nov 1, 2020, 06:50 PM IST
    • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల్లో ఆదివారం రోజు తగ్గుదల కనిపించింది.
    • రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య విభాగం జారీ చేసిన తాజా హెల్త్ బులెటిన్ లో కొత్తగా 2618 కేసులు నమోదు అయినట్టు తెలిపింది.
    • దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,25,966కు చేరుకుంది.
AP COVID-19 UPDATES: ఏపీలో కొత్తగా 2618 కరోనా కేసులు, 16 మంది మరణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల్లో ఆదివారం రోజు తగ్గుదల కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య విభాగం జారీ చేసిన తాజా హెల్త్ బులెటిన్ లో కొత్తగా 2618 కేసులు నమోదు అయినట్టు తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,25,966కు చేరుకుంది.  మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం నాటి హెల్త్ బులెటిన్ ప్రకారం కృష్ణా జిల్లాలో నలుగురు,  చిత్తూరులో ముగ్గురు, గుంటూరు, అనంతపురంలో ఇద్దరు, తూర్పు గోదావరి జిల్లాతో పాటు శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, వైజాగ్ లో ఒకరు కోవిడ్-19 ( Covid-19) వల్ల మరణించారు. 

Also Read |Telangana: ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ గడువు పెంపు

మరోవైపు ఏపిలో ( Andhra Pradesh ) రికవరీ రేటు భారీగా పెరుగుతోంది. కొత్తగా 3509 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 7,95,592కు పెరిగింది.  ఆదివారం ఉదయం నాటికి 23,668 యాక్టివ్ కేసులు ఉన్నాయని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 81,15,685 పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 88,780 టెస్టులు నిర్వహించారు.

Also Read | RAPO: రామ్ పోతినేని వర్క్ ఫ్రమ్ హోమ్ లుక్ చూశారా ?

వివిధ జిల్లాలా గణాంకలను పరిశీలిస్తే చిత్తూరులో 493 కేసులు, పశ్చిమ గోదావరి 296 కేసులు, తూర్పు గోదావరి 291కేసులు, గుంటూరులో 387,  కృష్ణా 328, అనంతపూర్ 123, కడప 123, వైజాగ్ 85, ప్రకాశం 255, నెల్లూరు 96, విజయనగరంలో 74, కర్నూలులో 40 కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News