దేశమంతా ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాల ( Bihar Election Results ) వైపు చూస్తోంది. మరి కొన్నిగంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కుమారుడు తేజస్వీ యాదవ్ వైపు మొగ్గుచూపిన నేపధ్యంలో లాలూ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.
ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ( Lalu prasad yadav ) ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించినట్టు వైద్యులు ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మరి కొద్ది గంటల వ్యవధే మిగిలున్న నేపధ్యంలో లాలూ ఆరోగ్యం ( Lalu prasad yadav ) క్షీణించడం ఆందోళన కల్గిస్తోంది. ఎన్నికల ఫలితాల నేపధ్యంలోనే ఒత్తిడికి గురవుతున్నందున లాలూ ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు చెప్పారు. డయాలసిస్ మాత్రం కొనసాగుతోందని తెలిపారు.
లాలూ ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో జరిగిన దాణా కుంభకోణం గురించి తెలిసిందే. ఈ కేసులో లాలూ 2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పలు అనారోగ్య కారణాల దృష్ట్యా లాలూ ప్రసాద్ యాదవ్..రాంచీలోని రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని..అయితే ఇప్పటివరకూ డయాలసిస్ చేయాల్సిన అవసరం రాలేదని వైద్యులు తెలిపారు. కానీ ఇప్పుడు ఆరోగ్యం క్షీణించడంతో డయాలసిస్ చేయాల్సి వస్తోందన్నారు.
బీహార్ ఎన్నికల్లో మూడు దశల పోలింగ్ పూర్తయింది. రేపు అంటే మరి కొన్నిగంటల వ్యవధిలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆర్జేడీ-కాంగ్రెస్ ( RJD-Congress ) కూటమిదే విజయమని..లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ ( Tejaswi Yadav ) కాబోయే ముఖ్యమంత్రి అని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. లాలూ లేకుండా ఇవి తొలి బీహార్ ఎన్నికలు. ప్రచారంలో పాల్గొనకపోయినా..ప్రతిరోజూ పార్టీ కార్యక్రమాలు, ప్రజాభిప్రాయాన్ని టీవీ, వార్తా పత్రికల ద్వారా వీక్షించేవారని లాలూ సన్నిహితులు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్ని కూడా లాలూ చూశారని తెలుస్తోంది. రేపు ఫలితాలు వెలువడనున్న నేపధ్యంలో లాలూ తీవ్ర ఒత్తిడికి గురయ్యారని..అందుకే ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు ఇప్పటికే ధృవీకరించారు. Also read: Arnab Goswamy: బెయిల్ పిటీషన్ రద్దు చేసిన బాంబే హైకోర్టు