India Covid-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే తాజాగా నిత్యం నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా తగ్గింది.

Last Updated : Nov 10, 2020, 11:06 AM IST
India Covid-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Coronavirus updates in India: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే తాజాగా నిత్యం నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న 38 వేల కరోనా కేసులే నమోదయ్యాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా సగానికి సగం తగ్గింది. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రోజూ నమోదయ్యే కేసులకన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 92.64 శాతం ఉండగా.. మరణాల రేటు 1.48 శాతం ఉంది. 

గత 24 గంటల్లో సోమవారం ( నవంబరు 9న ) దేశవ్యాప్తంగా కొత్తగా.. 38,074 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 448 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,91,731 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,27,059 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Bihar Election Result Live: పోటా పోటీ ఆధిక్యంలో ఎన్డీఏ, కూటమి

సోమవారం కరోనాతో 42,033 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య దేశంలో 79,59,406 కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 5,05,265 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నట్లు వెల్లడించింది. Also read: Bihar Election Result: ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఇదిలాఉంటే.. సోమవారం దేశవ్యాప్తంగా 10,43,665 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 9 వరకు దేశంలో మొత్తం 11,96,15,857 నమూనాలను పరీక్షించినట్లు ఎసీఎంఆర్ వెల్లడించింది.

 

Bihar Election Result: బీహార్ కింగ్ ఎవరు?.. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News