కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఆశలు చిగురిస్తున్న నేపధ్యంలో..ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. భూ మండలంపై ఉన్న ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరి కొద్దిరోజుల్లోనే కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) అందుబాటులో రానుంది. డిసెంబర్ నాటికి లభిస్తుందనే నమ్మకం కలుగుతోంది. ఈ నేపధ్యంలో అసలీ వ్యాక్సిన్ ఖరీదు ఎంత ఉంటుందనే విషయంపై ఆందోళన నెలకొంది. సామాన్యులకు వ్యాక్సిన్ అందుతుందా అనేది సందేహంగా మారింది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ( Infosys Narayana murthy ) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భూమిపై ఉన్న ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలని నారాయణ మూర్తి సూచించారు. వ్యాక్సిన్ వ్యయాన్ని భరించేందుకు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలన్నారు. ఐక్యరాజ్యసమితి ( UNO ) సభ్యదేశాలు ఈ ఖర్చులో మేజర్ షేర్ భరించాలని కోరారు.
వ్యాక్సిన్ ఉత్పత్తి ఖర్చుల్ని పెద్ద పెద్ద సంస్థలు భరించాలని..ఎక్కువ లాభాల్ని ఆశించకూడదని నారాయణ మూర్తి తెలిపారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అందరికీ ఉచితంగా కోవిడ్-19 ( Covid 19 ) వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitaraman ) చెేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. అటు శాశ్వత వర్క్ ఫ్రం హోం విధానంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. Also read: Indian vaccines: అడ్వాన్స్ దశకు చేరుకున్న రెండు స్వదేశీ కరోనా వ్యాక్సిన్లు