Vaccination Dry run: దేశ చరిత్రలో అతిపెద్ద కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. వ్యాక్సిన్ పంపిణీకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఏర్పాట్లలో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ డ్రై రన్ జరగనుంది.
ప్రపంచమంతా ఎదురుచూసిన కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) వచ్చేసింది. ఆ వ్యాక్సిన్ పంపిణీ ( Vaccine Distribution )కు ఇప్పుడు భారతదేశం సిద్ధమైంది. భారతదేశ చరిత్రలో ఇదొక అతి పెద్ద వ్యాక్సినేషన్ ( India's biggest vaccination ) ప్రక్రియ కానుండటంతో అధికారులు పూర్తిగా అప్రమత్తమవుతున్నారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఒకటికి పదిసార్లు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే కీలకమైన డ్రై రన్‌ను చేపట్టారు.
డ్రై రన్ అంటే..
భారీ ఎత్తున ఓ కార్యక్రమం చేపట్టబోయే ముందు ముందస్తు జాగ్రత్తగా చేసే ప్రక్రియను డ్రై రన్ ( Dry run ) అంటారు వ్యాక్సినేషన్ డ్రై రన్ అంటే నామమాత్రపు అంటే డమ్మీ వ్యాక్సినేషన్ ప్రక్రియ. టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, లోపాల్ని గుర్తించే ప్రయత్నంలో భాగంగానే డ్రై రన్ నిర్వహిస్తారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ( Dummy vaccine ) ఇస్తారు.
దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ( Andhr pradesh ), గుజరాత్ ( Gujarat ), అస్సోం ( Assom ), పంజాబ్ ( Punjab ) రాష్ట్రాల్లో డ్రై రన్ రెండ్రోజులపాటు అంటే డిసెంబర్ 28 , 29 తేదీల్లో జరుగుతుంది. ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాల్లో ఈ డ్రై రన్ ఉంటుంది. డ్రై రన్లో పలు కీలకదశల్ని పరిశీలిస్తారు. ప్రతి జిల్లాలో వంద మందికి అవసరమైన టీకాను సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి తీసుకొస్తారు.
వ్యాక్సిన్ తీసుకునే వ్యక్తికి ఎస్ఎంఎస్ పంపిస్తారు. వ్యాక్సిన్ ఇచ్చే అధికారి పేరు, సమయం వివరాలు ఆ మెస్సేజ్‌లో ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఓ అరగంట సేపు అక్కడే కూర్చుని ఉండాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా కన్పిస్తే వెంటనే చికిత్స అందిస్తారు. ఆ సమచారాన్ని సెంట్రల్ సర్వర్ ద్వారా కేంద్రానికి పంపిస్తారు.
Also read: Driver less train: ఇవాళ దేశపు తొలి డ్రైవర్ రహిత ట్రైన్ ప్రారంభం