Kumbh Mela 2021: జనవరి 14న కుంభమేళా ప్రారంభం.. గంగానదీ స్నానాల ప్రాముఖ్యత తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన కుంభమేళా 2021 జనవరి 14న మకర సంక్రాంతి రోజున ప్రారంభం కానుంది. ఈ కుంభమేళా జనవరి 14న మకర సంక్రాంతి రోజున ప్రారంభమై.. ఏప్రిల్ 27 చైత్ర పూర్ణిమ వరకు కొనసాగనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2021, 04:21 PM IST
Kumbh Mela 2021: జనవరి 14న కుంభమేళా ప్రారంభం.. గంగానదీ స్నానాల ప్రాముఖ్యత తెలుసా?

Kumbh Mela 2021 Important dates: హరిద్వార్: ప్రపంచంలోనే అతిపెద్దదైన కుంభమేళా 2021 జనవరి 14న మకర సంక్రాంతి రోజున ప్రారంభం కానుంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా గంగా నది ఒడ్డునున్న హరిద్వార్ (Haridwar) నగరంతోపాటు అలహాబాద్, ఉజ్జయిని, నాసిక్‌లో జరగనుంది. కుంభమేళా సందర్భంగా లక్షలాది మంది భక్తులు గంగానదిలో పవిత్ర స్నానాన్ని చేస్తారు. 

12ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళా (Kumbh Mela 2021) లో గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించడం వలన మోక్షం లభిస్తుందని, వ్యాధులు, పాపల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల అపార విశ్వాసం. మకర సంక్రాంతి జనవరి 14 నుంచి ఈ కుంభమేళా ఉత్సవం ప్రారంభంకానుంది. Also Read: Fight of Arjuna and Lord Shiva: శివుడి కోసం ఘోర తపస్సు చేస్తూ శివుడిపైనే యుద్ధానికి దిగిన అర్జునుడు

అయితే ఈ కుంభమేళా జనవరి 14న మకర సంక్రాంతి (Makar Sankranti) రోజున ప్రారంభమై.. ఏప్రిల్ 27 చైత్ర పూర్ణిమ వరకు కొనసాగనుంది. ఈ కుంభంలో ప్రధానంగా 4 షాహిస్నాన్ ఘాట్‌లు, 6 ప్రధాన స్నాన్ ఘాట్‌లుంటాయి. ఈ కుంభమేళాలో భక్తులు పవిత్రమైన నదీ స్నానాలను చేస్తారు. ముఖ్యమైన పర్వదినాల్లో ఈ స్నానాలను ఆచరించడం హిందూ సంప్రదాయంలో గొప్ప విశేషంగా భావిస్తారు.

2021 కుంభమేళాలో నదీ స్నానాలు ఆచరించడానికి ప్రత్యేకమైన రోజులు
జనవరి 14న - మకర సంక్రాంతి 
ఫిబ్రవరి 11న - మౌని అమావాస్య
ఫిబ్రవరి 16న - వసంత పంచమి 
ఫిబ్రవరి 27న - మాఘ పూర్ణిమ 
మార్చి 11న - మహా శివరాత్రి (షాహిస్నాన్)
ఏప్రిల్ 12న - సోమవతి అమవాస్య (షాహిస్నాన్) 
ఏప్రిల్ 14న - బైసాకి (షాహిస్నాన్) 
ఏప్రిల్ 21న - శ్రీరామ నవమి 
ఏప్రిల్ 27న - చైత్ర పూర్ణిమ (షాహిస్నాన్)

Also Read: Sri Ram Mandir: శ్రీ రాముడి ఆలయంలో త్రేతాయుగం నాటి కళ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News