Polavaram Project: ఏపీ ప్రజల జీవనాడి పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. కీలకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టారు. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్( Andhra pradesh ) ప్రజల లైఫ్‌లైన్ పోలవరం ప్రాజెక్టు ( Polavaram Project ). దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( Former cm ys rajasekhar reddy ) ప్రారంభించిన ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2021 డిసెంబర్ లక్ష్యంగా పనులు వేగవంతమయ్యాయి. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీళ్లు అందించాలనేది ప్రభుత్వ సంకల్పంగా ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ), ఇతర అధికారులు పోలవరంపై సమీక్ష నిర్వహించారు.
పోలవరం ప్రాజెక్టు ( Polavaram Dam ) లో కీలకమైన ఘట్టానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమైన స్పిల్ వే ఛానెల్ ( Spillway channel ) లో కాంక్రీట్ పనుల్ని మొదలుపెట్టారు. 2020 వరదల కారణంగా స్పిల్ ఛానెల్ మట్టి పనులు, కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. నవంబర్ 30 నుంచి వరద నీటిని తోడటం ప్రారంభించారు. ఇప్పుడు మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులు ( Spillway concrete works ) మొదలెట్టారు. ఇప్పటివరకూ 2.5 టీఎంసీల నీటిని తోడినట్టు అధికారులు తెలిపారు. మట్టి తవ్వకం, అంతర్గత రహదార్ల పని చేస్తున్నారు. ఇప్పటి వరకూ 1 లక్షా 10 వేల 33 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి కాగా..స్పిల్ ఛానెల్లో 10 లక్షల 64 వేల 417 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వారు. మిగిలిన పనుల్ని జూన్ నెలలోగా పూర్తి చేయనున్నారు.
Also read: AP: జగన్ పాలనపై యూఎస్ ప్రశంసలు, విశాఖలో హబ్ ఏర్పాటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook