CM KCRs Bhupalapalli Tour Cancelled: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ నేటి పర్యటన వాయిదా పడింది. నేడు కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణాలతో భూపాలపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
ఉపిరితిత్తుల్లో మంట కారణంగా ఇబ్బంది పడుతున్న సీఎం కేసీఆర్(CM KCR) గురువారం నాడు సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఏ ప్రమాదం లేదని తెలిపారు. ఆయనకు ఛాతీలో మంట వచ్చిందని, ఊపిరితిత్తుల్లో స్వల్ప ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
Also Read: Elon Musk: ప్రపంచ ధనవంతుడు ఎలాన్ మాస్క్.. 10 ఆసక్తికర విషయాలు
ఇతర ఏ అనారోగ్య సమస్యలు సీఎం కేసీఆర్‌కు లేవని వైద్యులు స్పష్టం చేశారు. కరోనా వైరస్(CoronaVirus) లాంటి లక్షణాలేం లేవని, ఊపిరితిత్తుల సమస్యకు 5 రోజులపాటు వాడేందుకు మెడిసిన్ ఇచ్చినట్లు సమాచారం. వైద్య పరీక్షలు పూర్తయ్యాక ప్రగతి భవన్‌కు వెళ్లిపోయి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు.
Also Read: Gold Price Today: భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. క్షీణించిన వెండి ధర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook