బిజినెస్‌మేన్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన బాలీవుడ్ నటి

బిజినెస్‌మేన్ అమర్ ఖన్నా తనని వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తూ ఆమె ముంబై పోలీసులని ఆశ్రయించారు. 

Last Updated : Jan 31, 2018, 12:16 AM IST
బిజినెస్‌మేన్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన బాలీవుడ్ నటి

బాలీవుడ్‌లో అగ్రతారగా పేరుగాంచిన అలనాటి ప్రముఖ హీరోయిన్ జీనత్ అమన్ ఓ బిజినెస్‌మేన్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టారు. ఆ బిజినెస్‌మేన్ కూడా ఇంకెవరో కాదు... ఎన్నో ఏళ్లుగా జీనత్ అమన్ కుటుంబానికి బాగా తెలిసిన సన్నిహితమిత్రుడే. అతడి పేరు అమర్ ఖన్నా. బిజినెస్‌మేన్ అమర్ ఖన్నా తనని వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తూ ఆమె ముంబై పోలీసులని ఆశ్రయించారు. గత కొన్ని నెలలుగా ఖన్నా తనని వేధిస్తున్నారని, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంత కాలంగా ఖన్నాతో విభేదాల కారణంగా ఆమె అతడిని దూరం పెడుతూ వస్తున్నారు. అయితే, ఖన్నా మాత్రం ఆమెని వేధించడం మానలేదు. అతడిని నిరోధించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో జీనత్ అమన్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో ముంబై పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్ 304 డీ, సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం అమర్ ఖన్నా పరారీలో వున్నాడు.

 

1970-80లలో 'హరే రామ, హరే కృష్ణ', 'సత్యం శివం సుందరం', 'హీరా పన్నా', 'యాదో కీ బరాత్', 'డాన్' లాంటి చిత్రాలతో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అనిపించుకున్న జీనత్ అమన్‌కి ఆ రోజుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుండేది.

Trending News