Sasikala Release: తమిళనాట ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ అలియాస్ చిన్నమ్మ విడుదల కానున్నారు. కోవిడ్ చికిత్స పొందుతుండటంతో ఆసుపత్రిలోనే విడుదల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరోవైపు ఈ జెడ్ సెక్యూరిటీ కోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారు చిన్నమ్మ..
తమిళనాడు ( Tamil nadu ) రాష్ట్ర రాజకీయాల్లో కీలక ముద్ర వేసిన చిన్నమ్మ ( Chinnamma ) ఇవాళ విడుదల కానున్నారు. జయలలిత ( Jayalalitha ) మరణానంతరం జరిగిన పరిణామాల్లో అక్రమాస్థుల కేసులో నాలుగేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు శశికళ ( Sasikala ). ఇవాళ్టికి నాలుగేళ్లు పూర్తి కావడంతో బెంగుళూరు జైలు ( Bengaluru jail ) నుంచి విడుదల కానున్నారు. అయితే కోవిడ్ వైరస్ ( Covid19 virus ) బారిన పడటంతో వారం రోజుల్నించి ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నేపధ్యంలో ఆసుపత్రిలోనే శశికళ విడుదలకు ( Sasikala Releasing today ) సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. కోవిడ్ నిబంధనల ప్రకారం మరో పది రోజులు ఆసుపత్రిలోనే ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇవాళ్టి వరకూ మాత్రమే ఆసుపత్రిలో జైలు నిబంధనలు వర్తించనున్నాయి. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
మరోవైపు శశికళకు ఈ జెడ్ సెక్యూరిటీ ( E Z Security ) కల్పించాలని ఆమె తరపు న్యాయవాది కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చెన్నైలోని సోదరుడి కుమార్తె కృష్ణప్రియ ఇంట్లో నివాసముండబోతున్న శశికళకు సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర హోంశాఖ ( Union Home Ministry ) కు లేఖ రాశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook