CoronaVirus Cases In India: గత ఏడాది కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చినా ఏ ఒక్కరోజూ పాజిటివ్ కేసులు లక్ష నమోదు కాలేదు. కానీ ఈ నెలలో ఒక్కరోజు లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజలతో పాటు ప్రభుత్వాలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం నాడు సైతం 96,517 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మరణాలు సైతం భారీ సంఖ్యలో నమోదవుతుండగా కేంద్ర ప్రభుత్వం అందుకు కారణాలను విశ్లేషించింది.
మాస్కులు ధరించక పోవడం
కరోనా వచ్చిన కొత్తలో భయంతో మాస్కులు ధరించిన దేశ ప్రజలు ప్రస్తుతం వాడకం మానేశారు. మాస్కులు ధరించని కారణంగానే కోవిడ్ 19 వ్యాప్తి అధికంగా ఉంది. గతంలో గ్రామాలలో ఇళ్ల నుంచి బయటకు వచ్చినా మాస్కులను అంతగా ఎవరూ ధరించలేదు. ప్రస్తుతం గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా బయట తిరుగుతున్న కొందరు మాత్రమే మాస్కులు ధరిస్తున్నారు.
మాస్కులు ధరించే విధానం..
మాస్కులు ధరించడం ఎంత ముఖ్యమో, అది ధరించే విధానం సైతం అంతే ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చేతులు శుభ్రం చేసుకుని మాస్కులు ధరించాలి. మాస్కు ధరిస్తే మీ నోరు, ముక్కు, దవడ భాగం కప్పి ఉంచేలా ఉండాలి. మాస్కులు కనీసం రెండు లేయర్లుగా ఉండేవి ధరించాలి. కొందరు మాట్లాడే సమయంలో మాస్కులను కిందకి లాగుతున్నారు. దాని ద్వారా మీ ద్వారా ఇతరులకు, ఇతరుల ద్వారా మీకు కోవిడ్ 19 వ్యాప్తి చెందుతుంది.
భౌతికదూరం..
కరోనా వచ్చిన కొత్తలో గత ఏడాది భౌతిక దూరాన్ని పాటించారు. అప్పట్లో ప్రజల్లో కరోనా వైరస్ గురించి తెలియని భయం, ఆందోళన కనిపించేవి. కొన్ని నెలల నుంచి కరోనా కేసులు తగ్గాయని భయం తగ్గింది. కరోనా నిబంధనల్లో ఒకటైన భౌతికదూరాన్ని పాటించడం తగ్గించారు. తద్వారా సులువుగా కరోనా వైరస్ ఒకరి నుంచి పదుల సంఖ్యలో వ్యాప్తి చెందుతుంది. కనీసం రెండు మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్త పడాలి.
Also Read: Night curfew in Delhi: ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ.. ఏమేం అనుమతిస్తారంటే..
శానిటైజేషన్..
కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్న తొలి రోజుల్లో దాదాపుగా ప్రతి ఒక్కరూ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేవారు. కానీ ప్రస్తుతం చేతులు శుభ్రంగా లేకున్నా పట్టించుకోవడం లేదు. పరిశుభ్రతకు ప్రాధాన్యం తగ్గడం, భౌతిక దూరం పాటించకపోవడంతో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
ముక్కు, కళ్లను తాకడం..
కరోనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించడానికి కళ్లు, ముక్కు లాంటి అవయవాలు వాహకాలుగా ఉన్నాయి. గతంలో వైద్యుల సలహాలు పాటిస్తూ కళ్లను, ముక్కును పదే పదే తాకడం మానేశారు. ప్రస్తుతం అంతా పరిస్థితి సాధారణం అయిందని కళ్లకు పదే పదే తాకడం, ముక్కు నాసికా రంద్రాలను తాకడం చేస్తున్నారు. తద్వారా కరోనా వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించి మీకు హాని చేస్తుంది. మీ చుట్టుపక్కల వారికి కూడా వైరస్ వ్యాపిస్తుంది.
Also Read: Telangana COVID-19 Cases: తెలంగాణలో తాజాగా 1,498 కోవిడ్-19 పాజిటివ్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook