Caught on CCTV: బీజేపి నేత కారుపై పోలీసుల కాల్పులు.. 'హత్యకు కుట్ర' BJP నేత ఆరోపణలు

UP Cops opened fire at BJP leader: బీజేపి నేత ప్రయాణిస్తున్న కారుపై పోలీసులు కాల్పులకు పాల్పడిన ఘటన ఇది. ఉత్తర్ ప్రదేశ్‌లోని షామ్లి జిల్లా ఐలంలో ఢిల్లీ-సహ్రన్‌పూర్ రోడ్డుపై బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సీసీటీవీ ఫుటేజ్ (CCTV video) ప్రకారం చూస్తే.. రోడ్డుపై వెళ్తున్న కారు ఓ చోట పక్కకు ఆగగా.. కారు ఆగడంతోనే అది గమనించిన పలువురు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG cops) పోలీసులు ఆ కారును సమీపించి చుట్టుముట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2021, 04:42 PM IST
  • ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపి నేత కారుపై స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసుల కాల్పులు.
  • కాల్పుల్లో ఒక వ్యక్తికి గాయాలు.
  • తనని చంపేందుకు కుట్ర జరిగిందని ఆరోపించిన బీజేపి నేత.
Caught on CCTV: బీజేపి నేత కారుపై పోలీసుల కాల్పులు.. 'హత్యకు కుట్ర' BJP నేత ఆరోపణలు

UP Cops opened fire at BJP leader: బీజేపి నేత ప్రయాణిస్తున్న కారుపై పోలీసులు కాల్పులకు పాల్పడిన ఘటన ఇది. ఉత్తర్ ప్రదేశ్‌లోని షామ్లి జిల్లా ఐలంలో ఢిల్లీ-సహ్రన్‌పూర్ రోడ్డుపై బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సీసీటీవీ ఫుటేజ్ (CCTV video) ప్రకారం చూస్తే.. రోడ్డుపై వెళ్తున్న కారు ఓ చోట పక్కకు ఆగగా.. కారు ఆగడంతోనే అది గమనించిన పలువురు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG cops) పోలీసులు ఆ కారును సమీపించి చుట్టుముట్టారు. ఆ సమయంలో ఎస్ఓజీ పోలీసులు సివిల్ డ్రెస్సులో మఫ్టీలో ఉన్నారు. కారులో ఉన్న వారిని లక్ష్యంగా చేస్తూ తుపాకులు ఎక్కుపెట్టడంతో అది చూసి హడలిపోయిన పవార్ అక్కడి నుంచి వారి దాటుకుంటూ మళ్లీ వేగంగా కారును ముందుకు పోనిచ్చారు. దీంతో ఎస్ఓజీ పోలీసులు కారుపై 10-15 రౌండ్ల కాల్పులు జరపగా అందులో ఉన్న వారిలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. 

ఈ ఘటనపై అశ్వని పవార్ మాట్లాడుతూ.. ''అదే రాత్రి ఎస్ఓజీ కమాండర్ జీతేంద్ర సింగ్ ఆదేశాల మేరకు తన ఇంటికి వచ్చిన పోలీసులు తనని పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లి రాత్రంతా చిత్రహింసలు పెట్టారని, ఫేక్ కేసులు (Fake cases) పెట్టి లోపలేస్తామని బెదిరించారని ఆరోపించారు. తెల్లవారిన తర్వాత తన అనుచరులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో తనను విడిచిపెట్టారని లేదంటే తన పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని ఆవేదన వ్యక్తంచేశారు. తన ప్రత్యర్థుల వద్ద పోలీసులు సుపారీ తీసుకున్నారు కనుకే తనని హత్య చేసేందుకు కుట్రపన్నారని అశ్వని పవార్ (BJP leader Ashwani Pawar) ఆరోపించారు. 

Also read : EVMs and VVPATs: టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు.. పోల్ ఆఫీసర్‌పై EC వేటు

''తన పిల్లలు రెస్టారెంట్‌లో డిన్నర్ చేయాలని ఉందని అడగ్గా వారి కోరిక మేరకే మేము బయటికి వచ్చామని, దారిలో ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకునే క్రమంలో తన కారు రుఫ్‌పై పెట్టిన స్వైపింగ్ మెషిన్ అలాగే ఉండిపోయిందనే విషయం గుర్తుకురావడం వల్లే రోడ్డుపై కారు ఆపి పెట్రోల్ బంక్ సిబ్బందిని పిలుస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది'' అని అశ్వని పవార్ చెప్పుకొచ్చారు. 

ప్రత్యర్థుల వద్ద డబ్బులు తీసుకున్న పోలీసులు (UP Police) తనని హత్య చేసేందుకు కుట్ర చేశారని ఆరోపిస్తూ అశ్వని పవార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామని షామ్లి జిల్లా ఎస్పీ సుకిర్తి మాధవ్ తెలిపారు. హై ప్రొఫైల్ క్రైమ్స్‌ని (high-profile crimes) అరికట్టేందుకు జిల్లా స్థాయిలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలే ఈ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు (SOG police).

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News