Azmeera Chandulal Death News | తెలంగాణ మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఈ టీఆర్ఎస్ నేత ఇటీవల కరోనా బారినపడ్డారని తెలుస్తోంది. చికిత్స నిమిత్తం మూడు రోజుల కిందట హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన అజ్మీరా చందూలాల్ గురువారం రాత్రి తుదిశ్వాస(Azmeera Chandulal Passed Away) విడిచారు. చందూలాల్ మరణం తీరనిలోటని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇప్పటి ములుగు జిల్లా జగ్గన్నపేటలో ఆగస్టు 17, 1954న జన్మించిన అజ్మీరా చందూలాల్ ప్రస్థానం సర్పంచ్‌గా మొదలై రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఎదిగారు. గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చందూలాల్, ములుగు శాసనసభా స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు వరంగల్ ఎంపీగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఆపై తెలంగాణ(Telangana) ఏర్పాడ్డాక సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో తొలి మంత్రివర్గంలో సభ్యుడయ్యారు.
Also Read; Telangana: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం
తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక, అటవీ శాఖ మంత్రిగా చందూలాల్ సేవలందించారు. తెలంగాణ రాష్ట్రంలో తన కేబినెట్ లో గిరిజన సంక్షేమం, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రాష్ట్రానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం వయోభారంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రి చందూలాల్‌కు భార్య శారద, కుమారుడు ప్రహ్లాద్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చందూలాల్ మృతిపట్ల సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook