Corona Homam: పొగ పీలిస్తే కరోనా పోతుందట..ఆ ఎమ్మెల్యే చేస్తున్న ప్రచారం

Corona Homam: కరోనా మహమ్మారి దేశమంతా విస్తరిస్తోంది. కరోనా ఎలా ఎక్కడి నుంచి వస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నా..మూఢ నమ్మకాలు మాత్రం తొలగడం లేదు. పూజలు చేసి..పొగబెడుతున్నారు. ఊరంతా కలియదిరుగుతున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 26, 2021, 03:12 PM IST
Corona Homam: పొగ పీలిస్తే కరోనా పోతుందట..ఆ ఎమ్మెల్యే చేస్తున్న ప్రచారం

Corona Homam: కరోనా మహమ్మారి దేశమంతా విస్తరిస్తోంది. కరోనా ఎలా ఎక్కడి నుంచి వస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నా..మూఢ నమ్మకాలు మాత్రం తొలగడం లేదు. పూజలు చేసి..పొగబెడుతున్నారు. ఊరంతా కలియదిరుగుతున్నారు.

కరోనా వైరస్ సెకండ్ వేవ్(Corona Second Wave)ధాటికి దేశమంతా అల్లకల్లోమవుతోంది. కట్టడి కోసం రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్(Lockdown) లేదా కర్ప్యూ పాటిస్తున్నాయి. వ్యాక్సిన్ కొరత, మందుల కొరతను అధిగమించే చర్యల్లో ప్రభుత్వాలున్నాయి. అయినా సరే మూఢ నమ్మకాలు మాత్రం వదలడం లేదు. సాక్షాత్తూ ఎమ్మెల్యే.. పూజలు పునస్కారాలు చేస్తే కరోనా పోతుందంటూ ప్రచారం చేస్తున్నారు. కర్నాటకలోని బెళగావి దక్షిణ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ వ్యవహారమిది. 

కరోనా పోవాలంటూ కొబ్బరి, నెయ్యి, బియ్యం వంటి నూకలు వేసి అగ్నిహోత్ర హోమం (Agnihotra Homam)నిర్వహించారు. అంతవరకూ బాగానే ఉంది. ఎవరి నమ్మకం వారిదని సరిపెట్టుకోవచ్చు. హోమం చేయడంలో తప్పులేదు. అయితే అంతటితో ఆగకుండా  ధూపం అంటూ ఊరంతా పొగబెట్టారు. సాంబ్రాణి వేస్తూ స్వయంగా ఎమ్మెల్యేనే అనుచరులతో ఓ రిక్షా బండి తోలుకుంటూ ఊర్లో తిరిగారు. ఊరంతా పొగతో నింపేశారు. హోమంలో వాడిన పదార్ధాలన్నీ రిక్షాలో వేసి తిరిగారు. ఆ పొగ పీలిస్తే కరోనా పోతుందని సాక్షాత్తూ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ (Belagavi mla Abhay Patil) చెప్పుకుంటూ తిరిగారు. పూజలు చేయండి..కరోనా పోతుందని ప్రచారం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మూఢనమ్మకాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ ( Lockdown) నిబంధనల్ని పట్టించుకోకుండా అనుచరులతో తిరుగుతున్నారని..సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. 

Also read: Allopathic medicine: Ramdev పై కన్నెర్రచేసిన IMA.. రూ.1000 కోట్ల పరువు నష్టం దావా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News