Virat Kohli is Vegan : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాను Veganగా మారిపోయానని గతంలోనే తెలిపాడు. కానీ తన సూపర్ ఫిట్‌నెస్ కోసం వేగన్ డైట్ పాటిస్తానని పరుగుల యంత్రం కోహ్లీ తరుచుగా చెబుతుంటాడు. పంజాబ్‌కు చెందిన తల్లిదండ్రులకు పశ్చిమ ఢిల్లీలో జన్మించిన కోమ్లీ బటర్ చికెన్, తందూరి చికెన్ అలవాట్లు మానుకున్నానని ఇటీవల చెప్పాడు.
ఫుడ్ లవర్ అయినప్పటికీ ఫిట్‌నెస్ కోసం కొన్ని వదులుకున్న ఆటగాడు అతడు. రెగ్యూలర్ డైట్‌లో కోడిగుడ్డు తీసుకుంటున్నానని చెప్పడంతో విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వేగన్ అయిన కోహ్లీ (Virat Kohli) గుడ్డు తినడం ఏంటని కామెంట్ చేస్తున్నారు. కూరగాయలు, కోడిగుట్లు, 2 కప్పుల కాఫీ, పప్పు, దోశలు తినడాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. చైనీస్ వంటకాలు సైతం ఇష్టమని, స్వయంగా వాటిని వండి ఓ పట్టు పడతాడు. బాదం, పండ్లు, ప్రొటీన్లు అధికంగా లభించే పదార్థాలు తినేందుకు వెనుకాడడు.
Also Read: Sachin Tendulkar తొలిసారి ఏ దేశం తరుఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడంటే
Saw game changers on Netflix. Being a vegetarian athlete has made me realise what I have believed all these years regarding diet was a myth. What an amazing documentary and yes I’ve never felt better in my life after I turned vegetarian.
— Virat Kohli (@imVkohli) October 23, 2019
తన ఆహారపు అలవాట్ల కారణంగా నమ్మకాలు మారిపోయాయని, తనలో ఎంతో మార్పు వచ్చిందని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. వెజిటేరియన్‌గా మారిన తరువాత జీవితం ఇంత బాగుంటుందని అసలు ఊహించలేదని కొన్ని సందర్భాలలో ప్రస్తావించాడు. 2018లో వేగన్‌గా మారిపోయిన కోహ్లీ పాలు, గుడ్లు, మాంసం వదులుకున్నానని చెప్పాడు. అయితే Veganగా మారిన కోహ్లీ క్వారంటైన్ డైట్‌లో కోడిగుడ్లు ఉన్నాయని తెలిపాడు. ఇదెక్కొడి చోద్యమంటూ నెటిజన్లు కామెంట్లు మొదలుపెట్టారు.
Also Read: IPL 2021 UAE schedule: యూఏఈలోనే ఐపిఎల్ 2021.. BCCI నిర్ణయం
I thought virat kohli is a vegan but he mentioned eggs in his diet🤔
— Bharat (@bharat_148) May 29, 2021
మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తొలిసారిగా నిర్వహిస్తున్న టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం భారత్, న్యూజిలాండ్ జాతీయ జట్లు సన్నద్ధమవుతున్నాయి. జూన్ 18 నుంచి సౌతాంప్టన్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ (ICC WTC Final) టెస్ట్ ప్రారంభం కానుంది. భారత్, న్యూజిలాండ్ జట్లు క్వారంటైన్‌లో ఉంటూనే ప్రాక్టీస్ చేయడ గమనార్హం.
Virat Kohli claims he is a vegan but in his latest AMA, he said his diet includes eggs. That's bothering me.
— Jagruti (@JagrutiPotphode) May 30, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook