Anandaiah Corona Medicine: దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన ఆనందయ్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక ఆధారంగా అనుమతివ్వడంతో..ఇక పంపిణీ తిరిగి ప్రారంభం కానుంది. ఆనందయ్య మందు ఎలా తయారు చేస్తారు, ఏ మందు దేనికి ఉపయోగిస్తారో తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం కరోనా మందు(Krishnapatnam Corona Medicine)దేశవ్యాప్తంగా సంచలనం కల్గించింది. కరోనా వైరస్ నివారణకు అద్భుతంగా పనిచేస్తుందన్న వార్తలతో పాటు శాస్త్రీయతపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయుష్ (Ayush)విభాగం, సీసీఆర్ఏఎస్(CCRAS)రంగంలో దిగి మందుపై అధ్యయనం చేశాయి. పూర్తి స్థాయిలో అధ్యయనం తరువాత మందు వల్ల ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేవని తేల్చాయి. మందు వాడటం వల్ల నష్టం లేదని చెబుతూ..ఐ రకం మందు అంటే కంట్లో వేసే డ్రాప్స్‌కు మాత్రం అనుమతివ్వలేదు. ఈ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం మందు పంపిణీకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం కానుంది. ఇంతకీ ఆనందయ్య మందు ఎలా తయారు చేస్తారు(How to prepare Anandaiah Medicine)..ఏ మందు ఎలా ఉపయోగపడుతుందో వివరాలివీ..
ఆనందయ్య మందు(Anandaiah Medicine)లో పీ, ఎఫ్, ఎల్, కే, ఐ అంటూ ఐదు రకాల మందు అందుబాటులో ఉంది. ఇందులో పి రకం(P Type)మందును..తెల్లజిల్లేడు, మారేడు, ఇగురు, నేరేడు ఇగురు, వేపు ఇగురు, దేవర్ దంగిలే 5 బకెట్లు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, తోక మిరియాలు, పచ్చ కర్పూరం, ఫిరంగి చెక్కపొడి ఒక బకెట్ మిక్సీ చేసి..అవసరమైన తేనె కలిపి..4 గంటలు బాగా ఉడికించి తయారు చేస్తారు. ఈ మందు ఊపిరితిత్తుల్ని శుభ్రం చేయడంతో సహయపడుతుంది. కరోనా పాజిటివ్ వచ్చినవారు రోజుకు రెండుసార్లు మూడ్రోజులపాటు తీసుకోవాలి, పాజిటివ్ లేనివారైతే రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ఒకేరోజు రెండుసార్లు వినియోగించాలి.
Also read: AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు
ఇక ఎఫ్ రకం (F Type)మందును.పుప్పింటి ఆకు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్లు, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కిలోల వరకూ తీసుకుని మిక్సీ చేసి చూర్ణంగా చేసుకోవాలి. ఈ మందును పాజిటివ్ ఉన్నవారికి భోజనానంతరం రోజుకు రెండుసార్లు..మూడ్రోజులపాటు ఇవ్వాలి.
ఇక ఎల్ రకం (L Type)మందును నేల ఉసిరి, గుంట గలకర ఆకులు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, 2-3 కిలోల తేనె కలిపి తయారు చేస్తారు. కరోనా పాజిటివ్ ఉన్నవారికే ఇది ఇస్తారు. పి, ఎఫ్ రకాలతో పాటు రోజుకు ఒకసారి రెండ్రోజులివ్వాలి.
మరో మందు కే రకం(K Type). పెద్ద పల్లేరు కాయలు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనె 2-3 కిలోలు కలిపి తయారు చేస్తారు. ఈ మందును పాజిటివ్ ఉన్నవారికి రోజుకు ఒకసారి,,రెండ్రోజులివ్వాలి.
ఐదవ రకం మందు ఐ రకం(I Type). తేనె, ముళ్ల వంకాయ గుజ్జు, తోక మిరియాలతో డ్రాప్స్ రూపంలో చేస్తారు. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినవారికి కంట్లో పల్స్ స్థాయిని బట్టి ఒక్కొక్క డ్రాప్ వేయాలి. ఇంకా కంటి మందు విషయంలో పరిశోధన పూర్తి కానందున ఈ మందుకు అనుమతి లభించలేదు.
Also read: AP Curfew: ఏపీలో కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook