Madhya Pradesh: మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు తీవ్ర అస్వస్థత, మేదాంత ఆసుపత్రిలో చికిత్స

Madhya Pradesh: కరోనా మహమ్మారి దెబ్బకు సామాన్యులు..వీఐపీలు..సెలెబ్రిటీలు..రాజకీయ ప్రముఖులు అందరూ బలవుతున్నారు. ఇప్పుడు మరో సీనియర్ రాజకీయ నేత, మాజీ ముఖ్యమంత్రి పరిస్థితి విషమంగా మారింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 9, 2021, 06:00 PM IST
Madhya Pradesh: మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు తీవ్ర అస్వస్థత, మేదాంత ఆసుపత్రిలో చికిత్స

Madhya Pradesh: కరోనా మహమ్మారి దెబ్బకు సామాన్యులు..వీఐపీలు..సెలెబ్రిటీలు..రాజకీయ ప్రముఖులు అందరూ బలవుతున్నారు. ఇప్పుడు మరో సీనియర్ రాజకీయ నేత, మాజీ ముఖ్యమంత్రి పరిస్థితి విషమంగా మారింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది.

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ధాటికి జనం విలవిల్లాడుతున్నారు. ప్రముఖులు, రాజకీయ వేత్తలు అందరూ కరోనా బారిన పడుతున్నారు. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మరో సీనియర్ రాజకీయవేత్త, మాజీ ముఖ్యమంత్రికి తీవ్ర అస్వస్థత చేసింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత  కమల్‌నాథ్‌ (Kamalnath)అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతీ నొప్పి కారణంగా బుధవారం  ఆయనను  గురుగ్రామ్‌లోని  మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో ఆయనను శ్వాసకోశ విభాగానికి తరలించి సీనియర్‌ వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.రెండ్రోజుల్నించి జ్వరంతో బాధపడుతున్న కమల్‌నాథ్ ఆరోగ్యం క్షీణించిందని కాంగ్రెస్ ప్రతినిధి వెల్లడించారు.

కమల్‌నాథ్ అనారోగ్యం గురించి తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ నేతలు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు. అమటు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ (Sivaraj singh chauhan)కూడా కమల్‌నాథ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని ట్వీట్ చేశారు. కోవిడ్ 19 ను రాజకీయం చేశారనే ఆరోపణతో కమల్‌నాథ్‌పై మే 24వ తేదీన కేసు నమోదు చేశారు మద్యప్రదేశ్ (Madhya pradesh) పోలీసులు. కరోనా వాస్తవ లెక్కల్ని వెల్లడించాలని అడిగినందుకు తనపై కేసులు పెడుతున్నారని..దేశద్రోహి అంటున్నారని బీజీపీ ప్రభుత్వంపై కమల్‌నాథ్ మండిపడ్డారు. 

Also read: Jitin Prasada Joins BJP: బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News