Space Sector Reforms: అంతరిక్షంలో ఇండియాకు ప్రత్యేక స్థానముంది. ఇస్రో సాధించిన విజయాలు తెచ్చిపెట్టిన గుర్తింపు అది. ఇప్పుడు అంతరిక్షంలో మరింత అభివృద్ది సాధించేందుకు ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.
భారత అంతరిక్షరంగంలో ఇస్రో(ISRO) కీలక నిర్ణయం తీసుకుంది. స్పేస్ సెక్టార్‌లో ప్రైవేటు రంగాన్ని అనుమతిస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అంతరిక్ష రంగంలో ప్రైవేటు కంపెనీలకు అనుమతించింది. ఇక త్వరలో ప్రైవేటు కంపెనీలు అంతరిక్షరంగంలో రానున్నాయి.
రాకెట్ ప్రయోగాలు, లాంచింగ్ స్టేషన్లను దేశ భూభాగంలో లేదా ఇతర దేశాల్లో ప్రయోగాలు చేసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం (Central government)ప్రైవేటు సంస్థలకు కల్పించనుంది. దీనికి కేంద్ర అంతరిక్ష మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉన్న ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేన్ సెంటర్ స్థూలంగా చెప్పాలంటే ఇన్‌స్పేస్ (INSPACE) సంస్థ నుంచి అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ 2020 పేరుతో తెచ్చిన ముసాయిదాలో ప్రైవేటు కంపెనీలు ( Private Companies in Space Sector) రాకెట్ ప్రయోగాల కోసం లాంచింగ్ స్టేషన్లను సొంతంగా లేదా లీజు ద్వారా భూమి సేకరించుకోవచ్చు. ఈ ముసాయిదాపై ప్రముఖ భారత కంపెనీలు అగ్నికుల్ కాస్మోస్, స్కైరూట్ ఎరోస్పేస్ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. దీనివల్ల రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన స్టేషన్లు, లాంచింగ్ ప్యాడ్‌లను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అగ్నికుల్ కాస్మోస్ సంస్థ ప్రస్తుతం చిన్న ఉపగ్రహాల్ని ప్రయోగిస్తుంటే..స్కైరూట్ ఎరోస్పేస్ సంస్థ చిన్న చిన్న రాకెట్లను తయారు చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook