YSR Telangana Party: తెలంగాణలో మరో పార్టీ ఆవిర్భవించింది. ఊహించినట్టే వైఎస్ షర్మిల కొత్త పార్టీకు అంకురార్పణ చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని..వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రారంభించారు. పార్టీ జెండాను వైఎస్ షర్మిల ఆవిష్కరించారు.
అందరూ ఊహించినట్టే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని(Ysr Telangana party) స్థాపించారు వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్ షర్మిల పార్టీని, పార్టీ జెండాను ఆవిష్కరించారు. నాయకుడంటే ప్రజలతో మమేకమై నడవాలని..తెలుగు ప్రజల గుండె చప్పుడు వైఎస్ఆర్ అని కార్యక్రమానికి హాజరైన వైఎస్ విజయమ్మ(Ys vijayamma)వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్‌కు ఎవరిపైనా వివక్ష లేదని చెప్పారు. వైఎస్ షర్మిలను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్ కోసమే షర్మిల రాజకీయ ప్రవేశం చేసిందన్నారు.
వైఎస్ఆర్ నాయకత్వాన్ని నిలబెడతానని, తెలంగాణలో వైఎస్ఆర్ పాలన తీసుకొస్తానని వైఎస్ షర్మిల (Ys Sharmila) అన్నారు. నాన్న మాటిస్తే బంగారు మూట ఇచ్చినట్టేనని చెప్పారు. శత్రువులు సైతం ప్రశంసించిన నేత వైఎస్ఆర్ (YSR) అని కొనియాడారు. ఐదేళ్ల వైఎస్ఆర్ పాలనలో లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. ఆరోగ్యశ్రీ పేరుతో నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారముండగానే..ఫాంహౌస్‌లు చక్కబెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేవలం మాటల గారడీతోనే పాలన సాగిస్తున్నారన్నారు. వైఎస్సార్‌టీపీ(Ysrtp)లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. చట్టసభల్లో సగం సీట్లు మహిళలకే కేటాయించనున్నట్టు తెలిపారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయిస్తామన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
YSR Telangana Party: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం, జండా ఆవిష్కరించిన షర్మిల