Supreme Court: అమరావతి భూముల కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు

Supreme Court: అమరావతి భూముల కుంభకోణం కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ..ఈ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 20, 2021, 08:44 AM IST
Supreme Court: అమరావతి భూముల కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు

Supreme Court: అమరావతి భూముల కుంభకోణం కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ..ఈ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. 

అమరావతి భూముల కుంభకోణం(Amaravati Lands Scam)పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణను జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనం విచారిస్తోంది.ఏపీ ప్రభుత్వం(Ap government) తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, మరో ఫిర్యాదు దారుడి తరపు సీనియర్ న్యాయవాది పారస్ వాదన విన్పించారు. అధికారిక రహస్యాల ఉల్లంఘనకు సంబంధించిన సెక్షన్ 418ను హైకోర్టు విస్మరించిందని దుష్యంత్ దవే తెలిపారు. ఆస్ధుల బదిలీ చట్టం సెక్షన్ 55 ప్రకారం భూ కొనుగోలు సమయంలో అమ్మకందారుడికి కొనుగోలుదారుడు ఎందుకు కొంటున్నాడనే విషయం తెలియాలని చెప్పారు. అయితే ఈ కేసులో అమ్మకందారులకు విషయం తెలియదని ఆరోపించారు. ఇంకా అనేక ఇతర అంశాల్ని హైకోర్టు విస్మరించిందని..నోటీసులు జారీ చేసిన విచారణకు అనుమతివ్వాలని కోరారు. ప్రాథమిక దశలోనే హైకోర్టు ఈ కేసును కొట్టివేసిందని తెలిపారు. భూములు కొనుగోలు చేయడం రాజ్యాంగ హక్కుగా హైకోర్టు చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చీటింగ్ కేసులో న్యాయమూర్తికి రాజ్యాంగ హక్కు ఎలా కన్పించిందో అర్ధం కాలేదని దుష్యంత్ దవే వాదించారు. 

ఇక ప్రైవేటు వ్యక్తుల భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో క్రిమినల్ చట్టాల్ని ఎలా వర్తింపజేస్తారని హైకోర్టు(Ap High Court) ప్రశ్నించిందని..అయితే విచారణ జరిపినప్పుడే కదా..అన్నీ బయటపడేవని తెలిపారు. మరోవైపు కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా అమరావతి భూముల స్పెక్యులేషన్‌కు తెరపడిందంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం సరైంది కాదని మరో సీనియర్ న్యాయవాది పారస్ తెలిపారు. ఇన్ని వాదనలు విన్న తరువాత..పిటీషన్‌ను విచారణ అర్హత లేదంటూ సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేయడం విశేషం.

Also read: Ys jagan review on polavaram: పోలవరం ప్రాజెక్టు పనులపై వైఎస్ జగన్ సమీక్ష, కీలక సూచనలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News