Ys jagan review on polavaram: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పూర్తి కావడం, పనుల్లో క్వాలిటీ విషయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్..కొన్ని సూచనలు చేశారు.
పోలవరం ప్రాజెక్టు పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan)అధికారులతో సమీక్ష నిర్వహించి కీలకమైన సూచనలు చేశారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై చర్చించారు. స్పిల్ వే 42 గేట్లను అమర్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎగువ కాపర్ డ్యాం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. దిగువ కాపర్ డ్యాం పనుల పరిస్థితిని వివరించారు. 2022 జూన్ నాటికి రెండు కాలువలకు లింక్ పనులు పూర్తి కావాలని..లైనింగ్ పనుల్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు(Polavaram project) లో కీలకంగా ఉన్న ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యామ్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలవరం నిర్వాసితులతో మాట్లాడి..ఆర్ అండ్ ఆర్ పనులపై సమీక్షించారు(Ys jagan review on polavaram). ఆర్ అండ్ ఆర్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ పనులన్నీ పూర్తి నాణ్యతతో ఉండాలని..కాలనీల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరారు. వరదలొచ్చే సమయంలో నిర్వాసితులకు పునరావాసం ఏర్పాటు చేయాలన్నారు. నిర్దేశిత లక్ష్యంలోగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
Also read: Polavaram Project: పోలవరంపై చర్చ కోసం పట్టుబడిన వైసీపీ ఎంపీలు, లోక్‌సభలో ఆందోళన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook