Byjus app: ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ బైజుస్ చిక్కులో పడేట్టు కన్పిస్తోంది. యూపీఎస్సీ సిలబస్‌కు సంబంధించి తప్పుడు సమాచారం అందించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బైజుస్ యజమాని. అసలేం జరిగిందంటే..
ఇటీవలి కాలంలో సుపరిచితమై విస్తృతంగా వ్యాపిస్తున్న ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్ బైజుస్(Byjus App) చుట్టూ వివాదం బిగుసుకుంటోంది. యూపీఎస్సీ ప్రిపరేటరీ మెటీరియల్‌లో సిలబస్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బైజుస్ యజమాని రవీంద్రన్. ఈ ఆరోపణలపై బైజుస్ యజమాని రవీంద్రన్‌పై ముంబై పోలీసులు (Mumbai police) ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. యూపీఎస్సీ(UPSC) మెటీరియల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐను యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ట్రాన్స్‌నేషనల్ ఆర్గనేజ్డ్ క్రైమ్‌కు నోడల్ ఏజెన్సీగా పేర్కొన్నట్టు ఫిర్యాదు ఉంది. క్రిమోఫోబియా అనే సంస్థ ఈ ఫిర్యాదు దాఖలు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు..నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 ఎ కింద జూలై 30వ తేదీన ఫిర్యాదు నమోదు చేసింది.
ఈ వ్యవహారంపై బైజుస్ కంపెనీ స్పందించింది. ఎఫ్ఐఆర్ను న్యాయవాదులు పరిశీలిస్తున్నారని వెల్లడించారు. క్రిమో ఫోభియా లేఖను కూడా ధృవీకరించిన సంస్థ..తాము అందించిన మెటీరియల్ సరైందేనని భావిస్తున్నారు. దీనికి సంబంధంచి కేంద్ర హోంశాఖ (Union home ministry) జారీ చేసిన అధికారిక కాపీని ఫిర్యాదు చేసిన క్రిమో ఫోబియా సంస్థకు షేర్ చేసినట్టు బైజుస్ తెలిపింది.
Also read: పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook