Pegasus Spyware: పెగసస్ స్పైవేర్‌పై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

Pegasus Spyware: పెగసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెగసస్ స్పైవేర్‌పై ఆరోపణల్ని నిపుణుల కమిటీ పరిశీలిస్తోందని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టులో ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 16, 2021, 04:01 PM IST
Pegasus Spyware: పెగసస్ స్పైవేర్‌పై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

Pegasus Spyware: పెగసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెగసస్ స్పైవేర్‌పై ఆరోపణల్ని నిపుణుల కమిటీ పరిశీలిస్తోందని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టులో ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. 

దేశవ్యాప్తంగా పెగసస్ స్పైవేర్(Pegasus Spyware)వ్యవహారం సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లో సమాధానమిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అంశంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరగా..ఈ అఫిడవిట్ దాఖలు చేసింది.పెగసస్ ఆరోపణల్లో వాస్తవం లేదని..ప్రతిపక్షం, జర్నలిస్టుల ఆరోపణలు నిజం కాదని కేంద్రం కొట్టిపారేసింది. పెగసస్ నిగ్గు తేల్చేందుకు ట్రిబ్యునల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. అయితే ట్రిబ్యునళ్ల ఏర్పాటు, సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరి అవకాశంగా మరో పదిరోజులు గడువిస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు(Supreme Court) సూచించిన వ్యక్తులతో స్వతంత్య్ర సభ్యుల నిపుణుల కమిటీ పెగసస్ స్పైవేర్ అంశంపై పరిశీలన చేస్తుందని కేంద్రం వెల్లడించింది. పెగసస్ స్పైవేర్ ఉపయోగించారా లేదా అనేది అఫిఢవిట్‌లో స్పష్టం చేయలేదని పిటీషనర్ తరపు న్యాయవాదులు తెలిపారు. 

జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలున్నందున అఫిడవిట్ దాఖలు చేయలేదని తెలిపింది. తాము మాత్రం చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నామని కేంద్రం(Central government)వివరించింది. ఇదే సమాధానాన్ని పార్లమెంట్‌కు ఇచ్చామని చెప్పింది. 

Also read: India Corona Update: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా మహమ్మారి ఉధృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News