Panjshir Province: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆధిపత్యపోరుకు చెక్ పడింది. జరుగుతున్న అంతర్యుద్ధంలో తాలిబన్లు పైచేయి సాధించారు. పంజ్‌షీర్ ప్రావిన్స్‌పై తాలిబన్లు పట్టు సాధించారు. పంజ్‌షీర్‌పై తాలిబన్ల జెండా ఎగిరింది.
ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని వశపర్చుకున్న తాలిబన్లకు నిన్నటి వరకూ పంజ్‌షీర్ ప్రావిన్స్ పెద్ద ఇబ్బందిగా మారింది. పంజ్‌షీర్ ప్రతిఘటన దళాలు ఎప్పటికప్పుడు తాలిబన్లను తిప్పికొడుతూ వచ్చారు. తాలిబన్ల ఆధిపత్యాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ నేపధ్యంలో ఇరువురి మధ్య గత కొద్దిరోజులుగా ఆధిపత్యపోరు సాగుతోంది. తాలిబన్లు ఆఫ్ఘన్‌ను వశపర్చుకున్నప్పటి నుంచి సాగుతున్న ఆధిపత్యపోరు ఎట్టకేలకు ముగిసింది. హోరాహోరీ పోరులో తాలిబన్లు పైచేయి సాధించారు. పంజ్‌షీర్ ప్రావిన్స్‌ను తాలిబన్లు చేజిక్కించుకున్నారు. మొత్తం ప్రాంతమంతా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ఉదయం తాలిబన్లు అదికారికంగా ప్రకటించుకున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan)మిగిలిన చిట్టచివరి ప్రాంతాన్ని సైతం సఫలమైనట్టు తాలిబన్ ప్రతినిధి జబీహూల్లా ముజాహిద్ ప్రకటించారు. మరోవైపు పంజ్‌షీర్ ప్రావిన్స్(Panjshir Province) గవర్నర్ కార్యాలయంపై తాలిబన్లు జెండా ఎగురవేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తాలిబన్లను భారీ సంఖ్యలో మట్టుబెట్టామని పంజ్‌షీర్ ప్రతిఘటన దళాలు ప్రకటించుకున్న గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. అటు పంజ్‌షీర్ ప్రతిఘటన దళాల(Panjshir Resistance Forces) నేత అహ్మద్ మసూద్ సైతం చర్చల కోసం చూస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. పంజ్‌షీర్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్నారనే వార్తను పంజ్‌షీర్ దళాలు ధృవీకరించలేదింకా. ఇదిలా ఉంటే..పాకిస్తాన్ సహాయంతోనే పంజ్‌షీర్‌ను తాలిబన్లు(Talibans) స్వాధీనం చేసుకున్నారంటూ అంతర్జాతీయ మీడియా కధనాలు ప్రచురిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో పంజ్‌షీర్ దళాలతో నెలకొన్న అంతర్యుద్ధం ముగియడంతో ఇక ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెడతారని తెలుస్తోంది.
Also read: Whatsapp New Feature: వాట్సప్ నుంచి సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్ చూశారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook