Gold Price Today: బంగారం ధరలు భారీగా పెరిగాయి. కొద్దిరోజుల్నించి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా అమాంతంగా పెరగడంతో వినియోగదారులకు షాక్ తగిలింది. ఒక్కరోజులోనే ఎంత పెరిగిందంటే..
బంగారం కొనుగోలు చేయాలనుకుంటే కాస్త ఆగాల్సిందే. ఎందుకంటే బంగారం ధరలు(Gold Price) ఒక్కసారిగా పెరిగాయి. గత కొద్దిరోజుల్నించి బంగారం ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశంలో ధరలు పెరిగిపోయాయి. న్యూఢిల్లీ బులియన్ జువెల్లరీ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 47 వేల 208 రూపాయల్నించి 47 వేల 573 రూపాయలకు చేరింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఒక్కరోజులోనే 3 వందలకు పైగా పెరిగి 44 వేల 402 రూపాయల వద్ద నిలిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు 44 వేల 510 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల ధర 48 వేల 560 రూపాయలుగా ఉంది. వెండ ధర కూడా పెరిగింది. బంగారం, వెండి ధరలనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో(International Market) పసిడి ధరల్లో మార్పులు, బంగారం నిల్వలు ఇతర పరిస్థితుల కారణంగా మారుతుంటాయి.
Also read; Reliance Industries: ముకేష్ అంబానీ అరుదైన ఘనత, వంద బిలియన్ డాలర్లకు చేరువలో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook