Organs Donation: మీ శరీరంలోని ఏఏ అవయవాలను దానం చేయవచ్చో తెలుసా..!

అన్నిదానాల కంటే అవయవదానం గొప్పది. చనిపోయాక అవయవాలు మట్టిపాలు చేయటం కంటే..మన అవయవాలను దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుదాం. ఒక్కరి అవయవాలను  దానం చేయడం వల్ల పది మంది ప్రాణాలు నిలబెట్టొచ్చు. మనం చచ్చాక ఆస్థికలను గంగలో కలిపితే ఎంత పుణ్యం వస్తుందో తెలియదు కానీ..మనం చేసే అవయవదానం వల్ల మాత్రం తప్పక పుణ్యం లభిస్తుంది. అవయవదానం చేసిన ప్రతి ఒక్కరి కీర్తి చరిత్రలో నిలిచిపోతుంది.

Last Updated : Sep 12, 2021, 02:07 PM IST
Organs Donation: మీ శరీరంలోని ఏఏ అవయవాలను దానం చేయవచ్చో తెలుసా..!

Organs Donation: చనిపోయిన వ్యక్తి అవయవాలను దానం చేయడం ద్వారా ఒకరి జీవితం ముగిసినప్పటికీ.. మరొకరి జీవితం రూపంలో మరో ప్రయాణాన్ని ప్రారంభించొచ్చు. కాగా, మనిషి చనిపోయిన తరువాత శరీరం(Body)లోని కొన్ని భాగాలను దానం చేయవచ్చు. దీని కోసం ఒక ప్రక్రియ ఉంది. ఇది చట్టబద్ధమైనది. 
ఒక్క అవయవ దానం ద్వారా దాదాపు 50 మంది నిరుపేదలకు సహాయం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అధికారిక సమాచారం ప్రకారం.. భారతదేశం(India)లో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది అవయవ దానం లేకపోవడం వల్ల మరణిస్తున్నారు. అంతేకాదు.. దేశంలో ఒక మిలియన్ మందికి 0.26 శాతం మంది మాత్రమే అవయవాలను దానం చేస్తున్నారు.

ఏ అవయవాలను దానం చేయవచ్చు..

అవయవ దానం(Organ Donation) రెండు రకాలు. మరణం తర్వాత చేసే అవయవ దానం ఒకటి.. సజీవ అవయవ దానం రెండు. ఒక వ్యక్తి అవసరమైన వారికి సహాయం చేయడానికి మూత్రపిండాలు, క్లోమం కొంత భాగాన్ని దానం చేయవచ్చు. మరణం తర్వాత అవయవ దానంలో, మరణించిన వ్యక్తి శరీరంలో సక్రమంగా పని చేసే అవయవాలన్నీ దానం చేయవచ్చు. అలాగే.. 8 రకాల అవయవాలను దానం చేయొచ్చు. మరణించిన వ్యక్తి మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, క్లోమం, ప్రేగులు వంటి అవయవాలను దానం చేయవచ్చు.

ఎవరు చేయగలరు..

ఏ వ్యక్తి అయినా అవయవ దానం చేయవచ్చు. దీనికి సంబంధించి వయస్సుపై ఎలాంటి నిర్బంధమూ లేదు. నవజాత శిశువుల నుండి 90 ఏళ్ల వృద్ధులకు అవయవ దానాలు విజయవంతమయ్యాయి. అయితే, 18 ఏళ్లలోపు వ్యక్తి తన అవయవాలను దానం చేయాలనుకుంటే, వారి తల్లిదండ్రుల(Parents) అనుమతి తప్పనిసరి.

రూల్స్..

అవయవ దానం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ రూపొందించింది. వీటిని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లేదంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ఎవరైనా అవయవ దానం చేయాలనుకుంటే దాని కోసం వారు ప్రతిజ్ఞ ఫారమ్‌(Forms)ను పూరించాలి. ఆ తర్వాత మాత్రమే వారు అవయవ దానం ప్రక్రియలో పాల్గొనవచ్చు. దీని కోసం www.organindia.org లో దరఖాస్తు చేసుకోవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News