Taliban Bans IPL Broadcast: యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021(IPL-2021) సీజన్ రెండో దశ ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది ఈ మ్యాచ్‌లను అఫ్గానిస్థాన్‌లోని క్రికెట్ అభిమానులు వీక్షించలేకపోతున్నారు. ఇటీవల దేశాన్ని హస్తగతం చేసుకుని అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు(Taliban).. ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించారు. ‘మతభావాలకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్’ కారణంగా ఈ ప్రసారాలపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
Afghanistan national 📻 📺 will not broadcast the @IPL as usual as it was reportedly banned to live the matches resumed tonight due to possible anti-islam contents, girls dancing & the attendence of barred hair women in the 🏟️ by Islamic Emirates of the Taliban. #CSKvMI pic.twitter.com/dmPZ3rrKn6
— M.ibrahim Momand (@IbrahimReporter) September 19, 2021
‘‘ఐపీఎల్ మ్యాచ్‌లను అఫ్గానిస్థాన్‌లో ప్రసారం చేయడం లేదు. ఇందులో కంటెంట్, మహిళల డ్యాన్స్‌లు.. తదితర కారణాల దృష్ట్యా ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ తాలిబన్ ఈ టోర్నీ ప్రసారాలపై నిషేధం విధించింది’’ అని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ మీడియా మేనేజర్, జర్నలిస్టు ఇబ్రహిం మహ్మద్ ట్విటర్లో వెల్లడించారు.
Also Read: IPL Man Of The Match: IPLలో అత్యధిక "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డ్స్ గెలిచింది వీళ్లే..!
ఇప్పటికే తాలిబన్ల పాలనలో అనేక వినోదాత్మక కార్యక్రమాలపై ఆంక్షలు వచ్చిన విషయం తెలిసిందే. అటు మహిళలు(Women) ఆటల్లో పాల్గొనడంపైనా నిషేధం విధించారు. పురుషులు క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చిన తాలిబన్లు.. తాజాగా ఐపీఎల్ ప్రసారాల(IPL Broadcasting)పై నిషేధం విధించడం గమనార్హం. అఫ్గానిస్థాన్ స్టార్ ఆటగాళ్లు రషీద్‌ఖాన్(Rashid Khan), నబీతో పాటు పలువురు అఫ్గాన్ క్రికెటర్లు ఐపీఎల్లో ఆడుతున్నారు. తాలిబన్ల తాజా నిర్ణయం పట్ల వీరు విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook