Huzurabad bypolls schedule: హుజూరాబాద్ ఉప ఎన్నికలో TDP పోటీ

Huzurabad bypolls latest updates: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకుడు ఘెల్లు శ్రీనివాస్ యాదవ్ (Ghellu Srinivas Yadav) పోటీ చేస్తుండగా బీజేపి నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) బరిలో నిలబడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2021, 03:36 PM IST
Huzurabad bypolls schedule: హుజూరాబాద్ ఉప ఎన్నికలో TDP పోటీ

Huzurabad bypolls latest updates: హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో తమ ఉనికిని కాపాడుకునేలా, పార్టీ కార్యకర్తల్లో, కేడర్‌లో జోష్‌ని నింపేలా హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. తాజాగా కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ అంబటి జోజిరెడ్డి హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టంచేశారు. హుజూరాబాద్‌లో పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరనే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని చెప్పిన జోజిరెడ్డి.. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, బీజేపిలను ఓడించాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. 

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకుడు ఘెల్లు శ్రీనివాస్ యాదవ్ (Ghellu Srinivas Yadav) పోటీ చేస్తుండగా బీజేపి నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) బరిలో నిలబడ్డారు. ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థి విజయాన్ని అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరు అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఇప్పటికే బీజేపి, టీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థిని ప్రకటించి ఎప్పటి నుంచో ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యాయి. 

Also read : Prashant Kishore meets YS Sharmila; వైఎస్ షర్మిలతో ప్రశాంత్ కిషోర్ భేటి.. చర్చకొచ్చిన అంశాలు ఇవేనా ?

హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రేపు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 8 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ కానుండగా అక్టోబర్ 11న నామినేషన్స్ పరిశీలన, 13న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. నవంబర్ 2న ఫలితం వెల్లడించనున్నారు. అంటే కాస్త అటు ఇటుగా మరో నెల రోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి ఎవరనేది (Huzurabad bypolls latest updates) తేలిపోనుందన్నమాట.

Also read : Godavari river: గోదావరి నీటి వివాదం.. తెలంగాణపై కేంద్రానికి ఎపీ సర్కార్ మరో ఫిర్యాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News