MAA Elections : ‘మా’ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన సీవీఎల్‌ నరసింహారావు, మేనిఫెస్టో ప్రకటించిన కొద్ది సేపటికే మారిన నిర్ణయం

CVL Narasimha Rao Nomination Withdraw: ఈ ఏడాది జరగబోయే మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్-మంచువిష్ణు  ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రధాన అభ్యర్థులుగా పోటీలో తలపడుతున్నారు. కాగా, ‘మా’ అధ్యక్ష పదవి కోసం తాను కూడా పోటీ చేస్తున్నానని ప్రకటించిన నటుడు సీవీఎల్‌ నరసింహారావు ఇప్పుడు ఒక ట్విస్ట్ ఇచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2021, 07:11 PM IST
  • మావీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు సంబంధించి ట్విస్ట్‌
  • పోటీ నుంచి తప్పుకున్న సీవీఎల్‌
  • మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే ఇలాంటి నిర్ణయం
MAA Elections : ‘మా’ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన సీవీఎల్‌ నరసింహారావు, మేనిఫెస్టో ప్రకటించిన కొద్ది సేపటికే మారిన నిర్ణయం

MAA Elections Soon after announcing manifesto CVL Narasimha Rao withdraws nomination for MAA polls: మావీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలకు సంబంధించి రోజుకో ట్విస్ట్‌ వస్తోంది. నటీనటుల విమర్శలు, ప్రతి విమర్శలతో మూవీ మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ ఏడాది జరగబోయే మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్-మంచువిష్ణు  ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రధాన అభ్యర్థులుగా పోటీలో తలపడుతున్నారు. కాగా, ‘మా’ అధ్యక్ష పదవి కోసం తాను కూడా పోటీ చేస్తున్నానని ప్రకటించిన నటుడు సీవీఎల్‌ నరసింహారావు ఇప్పుడు ఒక ట్విస్ట్ ఇచ్చారు. 

పోటీ నుంచి తప్పుకున్న సీవీఎల్‌

చివరి నిమిషం‍లో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు . అయితే దీని వెనుక కారణం ఉందని, మరో రెండు రోజుల్లో మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలను వెల్లడిస్తానని సీవీఎల్‌ తెలిపారు. తనకు అధ్యక్ష పదవి కంటే మా సభ్యుల సంక్షేమమే ముఖ్యమని చెప్పారు సీవీఎల్. అయితే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తను ప్రకటించిన మేనిఫెస్టో అమలు అయ్యేందుకు చూస్తానన్నారు. 

ఎవరికీ మద్ధతు ఇవ్వట్లేదు

అయితే తాను ఇప్పుడు పోటీలో ఉన్న రెండు ప్యానెల్స్‌లో ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. తాజాగా బండ్లగణేశ్‌ కూడా మా.. జనరల్ సెక్రెటరీ పదవికి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న నేపథ్యంలో..  సీవీఎల్‌ నరసింహారావు కూడా ఇప్పుడు పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News