Huzurabad bypolls nominations last date: హైదరాబాద్: ప్రస్తుత తెలంగాణ రాజకీయాలకు వేదికైన హుజూరాబాద్ ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. నేటితో నామినేషన్ల ప్రక్రియకు తెరపడనుండగా, 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 30న హుజూరాబాద్‌లో ఉప ఎన్నికకు నెల 1న పోలింగ్ జరగనుండగా, నవంబరు 2న ఓట్ల లెక్కింపు (Huzurabad bypolls votes counting) చేపడతారు.
ఈటల రాజేందర్ రాజీనామా నేపథ్యంలో జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. ఈ ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ (TRS candidate Ghellu Srinivas) ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ (వెంకట నర్సింగరావు) పోటీ చేస్తున్నారు.
Also read : Motkupalli Narsimhulu: దళిత బంధు పథకం కమిటీ చైర్మన్‌గా మోత్కుపల్లి నర్సింహులు ?
హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అధికార పార్టీని గెలిపించాల్సిందిగా మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హుజురాబాద్ ఉప ఎన్నికల క్షేత్రంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్‌ని (Etela Rajender) గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీజేపి శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని గెలిపించి టీఆర్ఎస్, బీజేపీకి కాంగ్రెస్ పవర్ ఏంటో తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు హోరెత్తిస్తున్నారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక (Huzurabad bypolls nominations latest updates) తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook