Petrol Price today: దేశంలో ఆగని పెట్రో మంట - రికార్డు స్థాయికి ధరలు

Petrol price today: దేశవ్యాప్తంగా వరుసగా నాలుగో రోజూ పెట్రోల్ రేట్లు భగ్గు మన్నాయి. దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2021, 12:34 PM IST
Petrol Price today: దేశంలో ఆగని పెట్రో మంట - రికార్డు స్థాయికి ధరలు

Petrol Price in India: పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. శుక్రవారం కూడా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను (Fuel price hiked) పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలకు అనుగుణంగానే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చెబుతున్నాయి.

ఇప్పటికే జీవన కాల గరిష్ఠం వద్ద కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం మరో రికార్డు స్థాయికి చేరాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో ధరలు ఇలా..

హైదరాబాద్​లో పెట్రోల్ (Petrol price in Hyderabad) ధర లీటర్​ 36 పైసలు పెరిగి.. రూ.113.32 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర (Diesel Price in Hyderabad) 38  పైసలు పెరిగి.. రూ.106.56 వద్ద ఉంది.

విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్​, డీజిల్ ధరలు 35, 36 పైసల చొప్పున పెరిగాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర (Petrol price in Vizag) రూ.114.03 వద్ద, డీజిల్ ధర (Diesel price in Vizag) రూ.106.69 వద్ద ఉన్నాయి.

ఇతర మెట్రో నగరాల్లో ఇంధన ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర (Petrol Price in Delhi) 35 పైసలు, డీజిల్ ధర లీటర్​ 35 పైసలు పెరిగింది. దీనితో పెట్రోల్, డీజిల్ (Diesel Price in Delhi) ధరలు లీటర్​కు వరుసగా.. రూ.108.99, రూ.97.73 వద్ద ఉన్నాయి.

చెన్నైలో పెట్రోల్ ధర (Petrol Price in Chenni) లీటర్​ 30 పైసలు పెరిగి.. రూ.105.7 వద్ద ఉంది. లీటర్ డీజిల్ (Diesel Price in Chenni) ధర 33 పైసలు పెరిగి.. రూ.101.88 వద్దకు చేరింది.

బెంగళూరులో పెట్రోల్ ధర (Petrol Price in Bengaluru) లీటర్​ 36 పైసలు పెరిగి రూ.112.75 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర 37 పైసలు పెరిగి (Diesel Price in Bengaluru) రూ.103.68 వద్దకు చేరింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర లీటర్​ 33 పైసలు పెరిగి (Petrol Price in Mumbai)రూ.114.77కి చేరింది. లీటర్ డీజిల్ ధర 38 పైసలు పెరిగి రూ.105.83 వద్ద (Diesel Price in Mumbai) కొనసాగుతోంది.

కోల్​కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటర్​కు.. 34 పైసలు, 35 పైసల చొప్పున పెరిగాయి. దీనితో లీటర్​ (Petrol Price in Kolkata) పెట్రోల్ ధర రూ.109.42 వద్దకు చేరింది. డీజిల్ ధర లీటర్​ (Diesel Price in Kolkata) రూ.100.8 వద్ద కొనసాగుతోంది.

Also Read: JioPhone Next: జియోఫోన్ నెక్ట్స్​ గురించి బిగ్ అప్​డేట్​- ధర, ఫీచర్ల వివరాలు వెల్లడి 

Also Read: EPF interest: ఈపీఎఫ్​ఓ చందాదారులకు గుడ్​ న్యూస్​- త్వరలోనే ఖాతాల్లో వడ్డీ జమ!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News