Kokkirala Premsagar Rao: కాంగ్రెస్‌కు ఆ సీనియర్ నేత షాక్... పార్టీకి గుడ్ బై చెప్పే యోచన..?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న ప్రేం సాగర్ రావు పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 12:56 PM IST
  • కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో కొక్కిరాల ప్రేం సాగర్ రావు
  • పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కట్లేదన్న అసంతృప్తి
  • గతంలో వైఎస్ హయాంలో చక్రం తిప్పిన నేత
  • పార్టీ నాయకత్వానికి అల్టిమేటం జారీ
Kokkirala Premsagar Rao: కాంగ్రెస్‌కు ఆ సీనియర్ నేత షాక్... పార్టీకి గుడ్ బై చెప్పే యోచన..?

Kokkirala Prem Sagar Rao Likely to Quit Congress Party: హుజురాబాద్ ఉపఎన్నిక ఓటమితో కాంగ్రెస్‌లో సీనియర్లు వర్సెస్ రేవంత్ ఫైట్ మళ్లీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.ఈ గొడవ ఇంకా చల్లారకముందే ఓ సీనియర్ నేత పార్టీకి షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేం సాగర్ రావు తాజాగా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారు.ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన జరపకుంటే ఇక తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరించారు.ఇందుకోసం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఈ నెల 10వరకు డెడ్ లైన్ విధించారు.

ఆలోగా ఉమ్మడి జిల్లా పార్టీలో ప్రక్షాళన జరగని పక్షంలో.. పార్టీని వీడుతామని,అవసరమైతే కొత్త పార్టీ పెట్టేందుకైనా సిద్ధమని ప్రేం సాగర్ రావు వెల్లడించారు.ఉమ్మడి జిల్లాలో తొలి నుంచి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు,నాయకులకు అన్యాయం జరుగుతోందన్నారు.కష్టపడి పనిచేసే కార్యకర్తలు,నాయకులకు ప్రాధాన్యం దక్కట్లేదన్నారు.ఇంద్రవెల్లిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కాంగ్రెస్ సభ కోసం కష్టపడ్డ కార్యకర్తలు,నాయకులను పార్టీ నాయకత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Jadeja Press Conference: ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే ఏం చేస్తారు?.. చమత్కారంగా జవాబిచ్చిన జడేజా

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శనివారం(నవంబర్ 6) ప్రేం సాగర్ రావు స్థానిక కార్యకర్తలు,నేతలతో సమావేశమవుతున్నారు.జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై పార్టీ శ్రేణులతో చర్చించిన అనంతరం తన భవిష్యత్ కార్యాచరణపై ప్రేం సాగర్ రావు నిర్ణయం తీసుకోనున్నారు.

గతంలో వైఎస్ హయాంలో ప్రేం సాగర్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చక్రం తిప్పారు.రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక జిల్లా నుంచి తన క్యాడర్‌తో వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.రేవంత్ నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలో మళ్లీ తనకు తగిన ప్రాధాన్యం లభిస్తుందనుకున్నారు. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లిలో తలపెట్టిన దళిత గిరిజన దండోరా సభ బాధ్యతలను రేవంత్ రెడ్డి మొదట ప్రేం సాగర్ రావుకే అప్పగించారు.

Also Read: Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్ కేసు విచారణ నుంచి వాంఖడేను తొలగించిన ఎన్సీబీ

అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే చెందిన ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.దీంతో అర్ధాంతరంగా ప్రేం సాగర్ రావును ఆ బాధ్యతల నుంచి తొలగించి మరొకరికి అప్పగించారు.అప్పటినుంచి ప్రేం సాగర్ రావులో అసంతృప్తి మరింత పెరిగింది.ఈ  నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడే దిశగా ఆలోచనలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News