Chennai Floods: తమిళనాడు రాజధాని నగరం చెన్నై మరోసారి భయం గుప్పిట్లో చిక్కుకుంటోంది. భారీ వర్షాలు ఆందోళన కల్గిస్తున్నాయి. మరోవైపు రానున్న 5 రోజులు నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయనే హెచ్చరిక 2015ను గుర్తు తెస్తోంది.
తమిళనాట భారీ వర్షాల(Heavy Rains)హెచ్చరిక జారీ అయింది. ఇప్పటికే గత 24 గంటల్నించి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి మోకాలి లోతు వరద నీరు చేరింది. చెన్నై నగర శివార్లలో వంద ఎకలా పంట నాశనమైంది. వరదనీరు పొలాల్లోకి ప్రవహించడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. పంటపొలాల్లోని నీటిని తరలించేందుకు అధికారులు రోడ్లను తెగ్గొట్టడంతో ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. గత 24 గంటల్నించి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెంబరబాక్కం జలాశయంలో ఇప్పటికే 21.15 అడుగులకు నీటమట్టం చేరింది. ఈ జలాశయం మొత్తం సామర్ధ్యం 25 అడుగులు. నీటిమట్టం 22 అడుగులకు చేరితే క్రస్ట్ గేట్లు ఎత్తివేయక తప్పని పరిస్థితి ఉంటుంది. అదే జరిగితే దిగువ ప్రాంతాలు నీట మునుగుతాయి. ఈ క్రమంలో చెంబరబాక్కం పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
ఎందుకంటే రాష్ట్రంలో మరో ఐదురోజులపాటు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణ శాఖ(IMD)హెచ్చరించింది. ఫలితంగా ప్రభుత్వ యంత్రాగం సహయక చర్యలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ప్రతియేటా అక్టోబర్ రెండవ వారంలో రాష్ట్రంలో ప్రవేశించే ఈశాన్య రుతుపవనాలు డిసెంబర్ వరకూ కొనసాగుతాయి. ఈసారి ఆలస్యంగా అక్టోబర్ 28న ప్రవేశించి..అధిక వర్షపాతానికి కారణమయ్యాయి. దక్షిణ తమిళనాడు, డెల్టా జిల్లాల్లో మరో ఐదురోజులపాటు ఉరుములు, పిడుగులతో పాటు భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఈ నెల 9వ తేదీన ఏర్పడే అల్పపీడన ద్రోణి 48 గంటల్లో బలపడి..ఉత్తర తమిళనాడు దిశగా పయనించనుంది. సముద్రంలో చేపలవేటకు వెళ్లిన జాలర్లు వెంటనే తిరిగి చేరుకోవాలని ఐఎండీ సూచిస్తోంది. బంగాళాఖాతం మధ్యన పశ్చిమాన, చుట్టుపక్కల ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఉరరితల ద్రోణి కారణంగా ఐదురోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపధ్యంలో తమిళనాడు ప్రజలకు ముఖ్యంగా చెన్నవాసులకు(Chennai Floods) 2015 నాటి వరద బీభత్సం కళ్లముందు కదలాడుతూ భయం గొలుపుతోంది.
మరోవైపు ప్రభుత్వ అన్నివిధాలా ముప్పు ఎదుర్కొనేందుకు సిద్ధమౌతోంది. రుతుపవనాల వల్ల ఎదురయ్యే విపత్కర పరిస్థితులలో రక్షణ చర్యలు చేపట్టేందుకు 8 వేల 462 అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంధ సేవకులు సిద్ధంగా ఉన్నారు. సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వం కంట్రోలు రూం ఏర్పాటు చేసి 044–24331074/ 24343662/1070/ 9445869843 ఫోన్ నెంబర్లను కేటాయించింది. అల్పపీడన ద్రోణి వల్ల ఏర్పడే ముప్పు నుంచి ప్రజలను రక్షించేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇప్పటికే అధికారులతో సమావేశమయ్యారు.
Also read: Heavy Rains Alert: ఏపీలో మరో 3-4 రోజుల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి