Anasuya Bharadwaj: పుష్ప నుంచి దాక్షాయణి పోస్టర్ రిలీజ్...ఎలా ఉందంటే..

Anasuya Bharadwaj: అందం, అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది అనసూయ. తాజాగా ఈ బ్యూటీ పుష్ప సినిమాలో నటిస్తోంది. ఆమెకు సంబంధించిన లుక్ ను ఈ రోజు రిలీజ్ చేసింది చిత్రబృందం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2021, 11:13 AM IST
Anasuya Bharadwaj: పుష్ప నుంచి దాక్షాయణి పోస్టర్ రిలీజ్...ఎలా ఉందంటే..

Anasuya Bharadwaj: విభిన్న పాత్రలను ఎంచుకుంటూ...తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj). రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. బడా సినిమాల్లో వరుస అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప(Pushpa Movie) సినిమాలో 'దాక్షాయని' అనే కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి అనసూయ పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్‌గా అలరించనున్నాడు. రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుంది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ డిసెంబర్‌17న విడుదల కానుంది.

Also read: BiggBoss 5 Telugu: సోనూసూద్ మద్దతు..సింగర్ శ్రీరామచంద్రకే, అభిమానుల సందడి

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఆర్య‌, ఆర్య 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప వస్తుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్(Fahad Fazil) నటిస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News