New Zeland Enters In T20 World Cup for the First Time: టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ ఫైనల్స్‌కు చేరింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆశ్చర్యకర రీతిలో ఇంగ్లాండ్‌పై (Eng vs NZ) విజయం సాధించి.. తుది పోరుకు సిద్ధమైంది.
మొదటి ఓవర్లోనే.. గప్తిల్ నాలుగు పరుగులకు ఔటవగా.. మూడో ఓవర్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ 5 పరుగులకే (Williamson)వెనుదిరిగాడు. దీనితో కివీస్ జట్టు విజయం అతి కష్టమని భావించినా.. ఇతర ఆటగాళ్లు అద్భుత విజయాన్ని అందించారు. దీనితో కివీస్ జట్టు తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌లో (T20 worldcup Finals) ఫైనల్స్‌కు చేరింది.
డారిల్ మిచెల్ 47 బంతుల్లో 72 పరుగులు చేసి.. అదరగొట్టాడు. మరో బ్యాటర్ డేవిన్ కాన్వే 38 బంతుల్లో 46 పరుగులు చేసి జట్టుకు అడగా నిలచాడు. డారిల్ మిచెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ (Daryl Mitchell Player of the Match) వచ్చింది.
Also read: ICC T20I Rankings: ఐసిసి ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి పడిపోయిన Virat Kohli, 5వ స్థానంలో KL Rahul
Also read: Virat Kohli: విరాట్ కోహ్లికి బెదిరింపుల విషయంలో హైదరాబాదీ అరెస్టు
మ్యాచ్ సాగిందిలా..
టాస్ ఓడి.. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాడ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. కివీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లీష్ జట్టు బ్యాటర్లు కూడా ఆరంభంలో తడబడ్డారు.
తొలి 5 ఓవర్లలో 37 పరుగులు చేయగా.. తరువాతి ఓవర్లో కీలక బ్యాటర్ బెయిర్ స్టో (13 పరగులు) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా కొద్ది సేపు రాణించలేకపోయారు. దీనితో పదో ఓవర్ ముగిసే సరికి ఇంగ్లాండ్ స్కోరు 67గా ఉంది. అప్పటికే 2 వికెట్లు కోల్పోయింది.
కానీ ఆ తర్వాత.. మెయిన్ అలీ, మలన్ స్కోర్‌ను ఉరకలు పెట్టించారు. దీనితో 15 ఓవర్లు ముగిసే సరికి 110 పరుగులు సాధించగలిగారు. ఇక ఆఖరి ఐదు ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయినప్పటికీ.. 56 పరుగులు సాధించించారు. ఇంగ్లాడ్ జట్టులో మెయిన్ అలీ అత్యధికంగా 51 పరుగులు చేశాడు. 14 ఎక్స్‌ట్రాలు లభించాయి. దీనితో కవీస్ జట్టు ముందు 167 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది ఇంగ్లీష్ టీమ్.
Also read: Syed Mushtaq Ali Trophy: టీ20ల్లో.. నాలుగు మెయిడిన్లు చేసిన ఏకైక బౌలర్ గా 'అక్షయ్' ప్రపంచ రికార్డు!
Also read: Rohit Sharma as T20I Captain: టీమిండియా T20I కేప్టేన్‌గా రోహిత్ శర్మను నియమించిన BCCI
ఇంగ్లాండ్‌పై కివీస్ రివేంజ్..
2019లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఓటమిని మిగిల్చిన ఇంగ్లాడ్పై.. కవీస్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. దాదాపు మ్యాచ్ సగం పూర్తయ్యేటప్పటికి ఫైనల్‌పై భారీ ఆశలు పెట్టుకున్న ఇంగ్లాడ్ టీమ్‌కు.. కివీస్ అనుకోని షాకిచ్చింది.
Also read: PV Sindhu: డ్యాన్స్ తో అదరగొట్టిన పీవీ సింధు..నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Also read: Ravishastri: టీమ్ ఇండియా కోచ్‌గా వైదొలగిన రవిశాస్త్రి, ఐసీసీపై ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
ENG vs NZ T20: టీ20 వరల్డ్‌కప్‌లో తొలిసారి ఫైనల్స్‌కు న్యూజిలాండ్
టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ విజయం
తొలిసారి ఫైనల్‌కు చేరిన కివీస్ జట్టు
డారిల్ మిచెల్ అద్భుత ప్రదర్శన