Mass Maharaj Ravi Teja Will Act in Bobby Megastar Chiranjeevis Mega 154 Movie: చిరు సినిమాలకు సంబంధించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇందులో మాస్ మహారాజ్ రవితేజ (Mass Maharaj Ravi Teja) కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి 154వ మూవీలో (Mega 154 Movie) కీలక పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటిస్తున్నారని టాక్. మైత్రీ మూవీమేకర్స్ (Mythri Movie Makers) సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో రవితేజ.. చిరంజీవి హీరోగా నటించిన హిందీ మూవీ ఆజ్ కా గూండారాజ్ సినిమాలో నలుగురు స్నేహితుల్లో ఒకరిగా నటించారు. 2000లో వచ్చిన అన్నయ్య (Annayya) మూవీలో చిరంజీవి తమ్ముడిగా రవితేజ నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా జిందాబాద్లో (Shankar Dada in Zindabad) ఓ పాటలో రవితేజ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు.
అయితే ఆ కీలక పాత్రకు రవితేజ అయితే సరిగ్గా సరిపోతాడని భావించి బాబీ (Bobby).. మాస్‌రాజాని అప్రోచ్ కూడా అయ్యారంట. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీనికి సంబంధించి క్లారిటీ త్వరలోనే రానుంది.ఇక ఆచార్య షూటింగ్ ను పూర్తి చేసుకున్న చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ (Godfather) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అలాగే మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ కూడా ప్రారంభమైంది.
Also Read : Vamika Rape Threat: కోహ్లీ కూతురును రేప్ చేస్తానని బెదిరించిన తెలుగు యువకుడు అరెస్ట్
ఇక రవితేజ నటించిన ఖిలాడి చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుండగా, ప్రస్తుతం రవితేజ ఖిలాడి, రామారావు ఆన్‌డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వర రావు మూవీల్లో నటిస్తున్నారు. ఇక రవితేజ చిరు (Chiru) చిత్రంలో కూడా తళుక్కమంటే అభిమానులకి పండుగే.
Also Read : Sajjanar : ప్రయాణికుడి ట్వీట్‌తో బస్ చార్జీలు తగ్గించిన సజ్జనార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook