Covid-19 Special Trains: కొవిడ్ స్పెషల్ ట్రైన్స్ అనే ముద్ర ఇకపై తొలగిపోనుంది. ప్రత్యేక రైళ్లు (Special Trains) పేరిట వసూలు చేసే అధిక ఛార్జీలకు కూడా రైల్వే శాఖ ముగింపు పలకనుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాకు ముందున్న విధంగానే రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చి టికెట్ ధరలు తగ్గించనున్నట్లు పేర్కొంది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది.
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ నుంచి రైల్వేశాఖ కేవలం ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతోంది. అనవసర ప్రయాణాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఛార్జీలను కూడా పెంచింది. అయితే పాతవాటినే ప్రత్యేక రైళ్లుగా నడుపుతూ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ.. ప్రయాణికుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. కరోనా ముందున్న విధంగానే రైళ్ల పేర్లు, నంబర్లు, ఛార్జీలు అమలు చేయాలని పేర్కొంటూ రైల్వేబోర్డు అన్ని జోనల్ కార్యాలయాలకు లేఖలు రాసింది.
అయితే గతంలో అందుబాటులో ఉన్న అన్ని రైళ్లు పట్టాలు ఎక్కడానికి ఒకట్రెండు రోజులు పడుతుందని సీనియర్ రైల్వే అధికారి చెప్పారు. ప్రత్యేక రైళ్ల నంబరు సున్నాతో ప్రారంభమవుతుందని, ఇప్పటి నుంచి అది ఉండబోదని తెలిపారు. అయితే.. కరోనా కారణంగా రాయితీలు, బెడ్‌రోల్స్, భోజనాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలు ప్రస్తుతానికి కొనసాగుతాయని చెప్పారు.
Also Read: Aadhaar Download: హుర్రే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, OTP లేకుండానే ఆధార్‌కార్డ్ డౌన్‌లోడ్
Also Read: Norovirus: కేరళలో నోరో వైరస్ కలకలం..అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook