Pradhan Mantri Awaas Yojana- Gramin: ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi ) ఈరోజు (ఆదివారం) 1 లక్షా 47 వేల మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ (DBT) ద్వారా రూ.700 కోట్లను బదిలీ చేశారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీన్ (PMAY-G) కింద లబ్ధిదారులకు పక్కా గృహాల కోసం ఈ మొత్తాన్ని విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ, 700 కోట్లు రూపాయలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన తరువాత ప్రసంగించారు.
Also Read: Curfew in Amaravati: అమరావతిలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. 4 రోజుల పాటు కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్
Today, Tripura and the entire northeast are becoming witnesses to change. The first instalment of Pradhan Mantri Awaas Yojana - Gramin (PMAY-G) given today, has given new morale to the dreams of Tripura: PM Narendra Modi pic.twitter.com/2d1lUIRpa1
— ANI (@ANI) November 14, 2021
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీన్ (Pradhan Mantri Awas Yojana- Gramin) కింద మొదటి విడతను బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసిన తర్వాత, ప్రధాని మోదీ లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంతకు ముందు ప్రభుత్వ పథకంలో కొంత మంది మాత్రమే లబ్ధి పొందేవారని, గత 7 సంవత్సరాలుగా, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనేదే మా ప్రయత్నమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook