ఆధునిక జీవితంలో ప్రధానంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యల్లో ముఖ్యమైంది చర్మ సంబంధిత సమస్యలు. ఇందులో యుక్త వయస్సులో ఎదుర్కొనే మొటిమలు. ఈ మొటిమల్నించి ఎలా రక్షించుకోవాలనేది తెలుసుకుందాం.
టీనేజ్ ప్రధానంగా సతమతమయ్యే సమస్య చర్మ సంబంధిత సమస్యలు(Skin Issues). ఇందులో ప్రధానంగా మొటిమల తీవ్రంగా వెంటాడుతుంటాయి. చర్మంపై వచ్చే మొటిమలతో యూత్ చాలా ఇబ్బంది పడుతుంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకైతే మరీ సమస్య. మొటిమలతో పాటు ఏర్పడే మచ్చలు, పిగ్నంటేషన్తో ఇబ్బంది పడుతుంటారు. మచ్చలేని చర్మం కావాలంటే ఆహారంలో ఏ విధమైన మార్పులు చేసుకోవాలి, ఏయే పదార్ధాలు తీసుకుంటే మంచిది, పిగ్మంటేషన్ సమస్యకు ఎలా చెక్ పెట్టాలనేది తెలుసుకుందాం. చర్మలోని ఉండే మెలానిన్ పదార్ధం లోపమే ఈ అన్నింటికీ కారణంగా తెలుస్తోంది. మెలానిన్ ఉండే పదార్ధాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మెలానిన్(Melonin) అనే పదార్ధానికి శక్తి కోసం క్యాబేజ్, పాలకూర, ఆకుపచ్చని కూరగాయలు తినాల్సి ఉంటుంది. దానిమ్మ, బొప్పాయి, స్ట్రాబెర్రీ, నారింజ వంటి పండ్లు మృదువుగా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్నే కాకుండా గుండె జబ్బుల్ని సైతం దూరం చేస్తాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తాయి. పెరుగులోని కాల్షియం, ప్రోటీన్, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటే చర్మంపై ప్రభావం చూపుతుంది. మొటిమలు(Pimples), మచ్చల్ని దూరం చేస్తుంది.
మనిషి శరీరానికి రోజుకు సరిపడే నీళ్లు అందాలి. అప్పుడే ముఖం మృదువుగా ఉంటుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శరీరంలో ఉన్న మలినాలు బయటకు పోతాయి. నీళ్ల ద్వారా పోషకాలు, ఆక్సిజన్ శరీరానికి అందుతుంది. మొటిమలు ఏర్పడకుండా నీళ్లు అడ్డుకుంటాయి. ఇక మరీ ముఖ్యంగా వివిధ రకాల పళ్లను గుజ్జుగా చేసి ముఖానికి ప్యాక్ అమర్చుకోవాలి. అలా చేయడం వల్ల యాపిల్‌లో ఉండే పెక్టిన్ పదార్ధం మొటిమల్ని దూరం చేస్తుంది. నిమ్మరసం శరీరంలోని మలినాల్ని బయటకు పంపి..చర్మాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. పుచ్చకాయలోని విటమిన్ ఎ, బి, సిలు చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతాయి.
Also read: మీ కిడ్నీలు ఎలా ఉన్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook