Bollywood actor Ranveer Singh's 83 Teaser Out: A Glimpse Of Ranveer Singh As Kapil Dev's Catch That Won The World Cup:
టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్.. 83 పేరుతో సినిమాగా తెరకెక్కుతోంది. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. 1983లో భారత జట్టు ప్రపంచకప్ ఎలా సాధించింది అనే ఆసక్తికర అంశంతో కబీర్ ( Kabir Khan) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కపిల్ భార్య రోమి భాటియా (రోమి దేవ్) పాత్రలో దీపికా పదుకొణె (Deepika Padukone) కనిపించనుంది.
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, నడియాడ్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, విబ్రి మీడియా, ఫాంటోమ్ ఫిల్మ్స్, కేఎ ప్రొడక్షన్స్, కబీర్ ఖాన్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ‘83’ మూవీ కరోనా వల్ల ఇప్పటికీ రిలీజ్ కాలేదు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ (Teaser Out) అయ్యింది.
The story behind India's greatest victory.
83 RELEASING IN CINEMAS ON 24TH DEC, 2021, in Hindi, Tamil, Telugu, Kannada and Malayalam.
Teaser out now.
Trailer out on 30th Nov.#ThisIs83@ikamalhaasan @KicchaSudeep @PrithviOfficial @RKFI @AnnapurnaStdios #KichchaCreations pic.twitter.com/Af1WcIOtmL— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 26, 2021
1983లోని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారధ్యంలో ఇండియా జట్టు తొలిసారి ప్రపంచ కప్పును గెలుచుకుంది. దీని ఆధారంగా దర్శకుడు 83 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆనాడు లండన్ లార్డ్ క్రికెట్ స్టేడియంలో ( Lord's Cricket Stadium, London) చోటు చేసుకున్న ఉత్కంఠ భరిత సంఘటనలను చూపిస్తూ మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘83’ మూవీ టీజర్‌ను అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. టీజర్ విజువల్స్, ఆర్ఆర్ ఆకట్టుకుంటున్నాయి.
Also Read : అరంగేట్రంలోనే సెంచరీతో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్!
ఈ మూవీ ట్రైలర్ నవంబర్ 30న రిలీజ్ కానుంది. డిసెంబర్ 24 తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో 83 మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో దీపికా పదుకొణెతో పాటు జీవా, తాహీర్ రాజ్ భాసీన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇక కపిల్ దేవ్‌గా (Kapil Dev) రణ్వీర్ సింగ్ పూర్తిగా ట్రాన్స్‌ఫాం అయ్యాడు. స్టేడియంలో చివరి బంతిని కపిల్ క్యాచ్ పడుతున్న సీన్‌తో ఈ టీజర్ ముగిసింది. ఈ మూవీని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున విడుదల చేయనున్నారు.
Also Read : IND VS NZ 1st Test: శ్రేయస్ సెంచరీ...భారత్ 345 పరుగులకు ఆలౌట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook